ఆర్థిక సంవత్సరం చివరి రోజైన నేడు స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. అంతర్జాతీయంగా నెలకొన్న పశ్చిమాసియా ఉద్రిక్తతలు మరియు ముడి చమురు ధరలు పెరగడం వంటి కారణాలతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గు చూపడంతో సూచీలు నేలచూపులు చూశాయి. ఇక నేటి ట్రేడింగ్ లో బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ సెన్సెక్స్ సుమారు 1,635 పాయింట్లు నష్టపోయి 71,947 వద్ద స్థిరపడింది. నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజ్ నిఫ్టీ 488 పాయింట్లు కోల్పోయి 22,331 వద్ద ముగిసింది. రూపాయి విలువ అమెరికా డాలర్ తో పోలిస్తే రికార్డు స్థాయిలో రూ.94.73 కు పడిపోయింది. ఉద్రిక్తతలు పెరగడం వల్ల గ్లోబల్ మార్కెట్లు కుప్పకూలాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 120 డాలర్లకు చేరువవ్వడం, విదేశీ ఇన్వెస్టర్లు ఉపసంహరణకు మొగ్గు చూపడం మార్కెట్ పై ఒత్తిడి పెంచింది. ఈరోజు ట్రేడింగ్ లో ఓఎన్జీసీ, హిందాల్కో, విప్రో, టీసీఎస్, కోల్ ఇండియా షేర్లు లాభాలతో ముగించాయి. రేపు మహావీర్ జయంతి సందర్భంగా భారత స్టాక్ మార్కెట్లకు సెలవు. తిరిగి ఏప్రిల్ 1న ట్రేడింగ్ ప్రారంభమవుతుంది.