పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్ గాయంపై మూవీ టీమ్ ప్రకటన 

Spread the love

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పెద్ది సినిమా షూటింగ్ లో గాయపడ్డారనే వార్తకు సంబంధించి మూవీ టీమ్ స్పష్టత ఇచ్చింది. ఈ మేరకు తెలుపుతూ ‘పెద్ది’ చిత్ర సెట్స్‌లో జరిగిన చిన్న సంఘటనపై వస్తున్న వార్తల గురించి మేము స్పందించాలనుకుంటున్నాము. రామ్ చరణ్ గారు సంపూర్ణ ఆరోగ్యంతో, క్షేమంగా ఉన్నారని మేం అందరికీ తెలియజేస్తున్నాము. షూటింగ్ సమయంలో ఆయన ఎడమ కంటికి చిన్న గాయం కావడంతో, ఒక చిన్న సర్జరీ/ప్రొసీజర్ చేయడం జరిగింది. షెడ్యూల్‌లో ఎలాంటి మార్పులు లేకుండా, ఆయన రేపటి నుండే తిరిగి షూటింగ్‌లో పాల్గొంటారు. మీ అందరి ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అంతా సవ్యంగా ఉంది, సినిమా పనులు వేగంగా ముందుకు సాగుతున్నాయని పేర్కొంది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *