దేశీయ స్టాక్ మార్కెట్లు నేటి ట్రేడింగ్ లో ఒడిదుడుకుల మధ్య లాభాల్లో ముగిశాయి. అమెరికా-ఇరాన్ మధ్య భౌగోళిక ఉద్రిక్తతల నేపథ్యంలో ఉదయం సెన్సెక్స్ 1,500 పాయింట్లకు పైగా పతనమైంది. అయితే, ఐటీ (IT) మరియు ఎఫ్.ఎమ్.సి.జి (FMCG) రంగాల్లో కొనుగోళ్లు పెరగడంతో తిరిగి కోలుకుని లాభాల బాట పట్టింది. నేటి ట్రేడింగ్ లో బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ సెన్సెక్స్ 185 పాయింట్లు లాభపడి 73,319 వద్ద స్థిరపడింది. నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజ్ నిఫ్టీ 33 పాయింట్ల లాభంతో 22,713 వద్ద ముగిసింది. డాలర్ తో రూపాయి మారకపు విలువ రూ.93.12గా కొనసాగుతోంది. ఐటీ రంగం, రియల్టీ, మెటల్ రంగాలు రాణించాయి. ఫార్మా మరియు కన్స్ట్రక్షన్ రంగాలు ఒత్తిడికి లోనయ్యాయి.నేటి ట్రేడింగ్ లో హెచ్.సి.ఎల్.టెక్నాలజీస్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, టీసీఎస్, టాటా కన్జ్యూమర్స్ లాభాలతో ముగిశాయి.