గెలుపు ఖాతా తెరిచిన సన్ రైజర్స్..కోల్ కతా పై భారీ విక్టరీ

Spread the love

ఈ ఐపీఎల్ సీజన్ లో మొదటి మ్యాచ్ లో పరాజయం చవిచూసిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తాజాగా ఆడిన రెండో మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ పై గెలిచి పాయింట్ల ఖాతా తెరిచింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ 65 పరుగుల తేడాతో గెలిచింది. మ్యాచ్ లో టాస్ గెలిచిన కోల్ కతా ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 226 పరుగులు చేసింది. ఓపెనర్లు ట్రావిస్ హెడ్ 46 (21; 6×4, 3×6), అభిషేక్ శర్మ 48 (21; 4×4, 4×6) మంచి ఆరంభాన్నిచ్చారు. వీరికి తోడు క్లాసీన్ 52 (35; 4×4, 1×6) హాఫ్ సెంచరీతో చెలరేగాడు. నితీష్ కుమార్ రెడ్డి 39 (24; 4×4, 1×6) పరుగులు చేయడంతో  భారీ స్కోర్ సాధించింది. ఇక కోల్ కతా బౌలర్లలో ముజరబని 4 వికెట్లు, వైభవ్ అరోరా 2 వికెట్లు, కార్తీక్ త్యాగీ, అనుకుల్ రాయ్ ఒక్కో వికెట్ పడగొట్టారు. ఇక టార్గెట్ ను ఛేదించే క్రమంలో కోల్ కతా కూడా ఇన్నింగ్స్ ను ధాటిగానే ఆరంబించినప్పటికీ అదే స్థాయిని ఆద్యంతం కొనసాగించలేకపోయింది. కీలక సమయాల్లో వికెట్లు కోల్పోతూ ఓటమి చెందింది. అంగ్క్రిష్ రఘువంశీ 52 (29; 6×4, 2×6) హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. రింకూ సింగ్ 35 (25; 4×4, 1×6), ఫిన్ అలెన్ 28 (7; 4×4, 2×6) పరుగులు చేశారు. మిగతా బ్యాటర్లు చెప్పుకోదగ్గ పరుగులు చేయలేదు. సన్ రైజర్స్ బౌలర్లలో జయదేవ్ ఉనద్కత్  3 వికెట్లు, ఈషాన్ మలింగ 2 వికెట్లు, నితీష్ కుమార్ రెడ్డి 2 వికెట్లు, హార్ష్ దూబే 1 వికెట్ తీశారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *