దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాలతో నేటి ట్రేడింగ్ ను ముగించాయి. ఇంటర్నేషనల్ మర్కెట్స్ నుండి ప్రతికూల సంకేతాలకు తోడు కొత్త ఏఐ టూల్స్ ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపలేదు. బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ సెన్సెక్స్ 1068 పాయింట్లు నష్టపోయి 82,225 వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజ్ నిఫ్టీ 288 పాయింట్ల నష్టంతో 25,424 వద్ద స్థిరపడింది. డాలర్ తో రూపాయి మారకపు విలువ రూ.90.95గా కొనసాగుతోంది. సెన్సెక్స్ 30 సూచీలో హెచ్.సి.ఎల్ టెక్నాలజీస్,టెక్ మహీంద్రా, ఎటర్నల్, ఇన్ఫోసిస్, టీసీఎస్ షేర్లు ప్రధానంగా నష్టపోయాయి. ఎన్టీపీసీ, హిందుస్థాన్ యూనిలీవర్, టాటా స్టీల్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, టైటాన్ షేర్లు లాభపడ్డాయి.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వల్ల ఐటీ రంగంలో ఉద్యోగ కోతలపై వచ్చిన వార్తలు మార్కెట్ పై ప్రభావం చూపాయి. డొనాల్డ్ ట్రంప్ కొత్త టారిఫ్ విధిస్తారనే ఆందోళనలు కూడా మార్కెట్ సెంటిమెంట్ ను దెబ్బతీశాయి.