
Sankranti Upcoming Movies 2026: సంక్రాంతి వస్తుంది అంటే.. సినిమాల పండగ వస్తున్నట్టే. సంక్రాంతికి సినిమాలు రిలీజ్ చేస్తే.. వచ్చే కలెక్షన్స్ వేరే లెవల్లో ఉంటాయి. అందుకనే సంక్రాంతికి తమ సినిమాలను రిలీజ్ చేయాలని హీరోలు, దర్శకులు, నిర్మాతలు పోటీ పడుతుంటారు. ఈసారి సంక్రాంతికి భారీ సినిమాలు థియేటర్స్ లోకి వచ్చేందుకు రెడీ అవుతున్నాయి. అయితే.. సంక్రాంతి రిలీజ్ ల్లో మార్పులు చేర్పులు జరుగుతున్నాయని టాక్ వినిపిస్తోంది. ఇంతకీ.. ఏం జరగనుంది..? ఏ ఏ సినిమాలు సంక్రాంతికి రాబోతున్నాయి..?
2026 సంక్రాంతికి అందరి కంటే ముందుగా వస్తున్నట్టుగా అనౌన్స్ చేసిన చిత్రం మెగా157. ఈ సినిమాని అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్నాడు. చిరంజీవికి జంటగా అందాల తార నయనతార నటిస్తుంది. ఈ సినిమాతో పాటు మాస్ మహారాజా రవితేజ, కిషోర్ తిరుమల కాంబోలో రూపొందుతోన్న మూవీ, నవీన్ పొలిశెట్టి అనగనగా ఒక రాజు, కోలీవుడ్ స్టార్ విజయ్ జన నాయగన్ ఈ నాలుగు సినిమాలు వస్తాయని వార్తలు వచ్చాయి. అయితే.. ఇప్పుడు సంక్రాంతి సినిమాల్లో భారీగా మార్పులు చేర్పులు జరుగుతుండడం విశేషం.
ఇంతకీ విషయం ఏంటంటే.. డిసెంబర్ 5న వస్తుందని అనౌన్స్ చేసిన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ది రాజాసాబ్ సంక్రాంతి బరిలోకి రాబోతుందని టాక్ వినిపిస్తోంది. అక్టోబర్ కే షూటింగ్ పూర్తి చేసుకుని రెడీగా ఉంటుందట. అయినప్పటికీ సంక్రాంతికి విడుదల చేయాలనే మేకర్స్ పై ఫ్యాన్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ ప్రెజర్ పెడుతున్నారని సమాచారం. ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే.. పవర్ స్టార్ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ కూడా సంక్రాంతి బరిలోకి రాబోతుందట. మెగా 157 మూవీ మాత్రం సంక్రాంతి బరి నుంచి తప్పుకుంటుందని ఇండస్ట్రీలో వినిపిస్తుంది. అన్నయ్య చిరంజీవివి తప్పుకుంటే.. తమ్ముడు పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ అంటూ రాబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. Sankranti Upcoming Movies 2026.
అలాగే బాలయ్య అఖండ 2 డిసెంబర్ లో కుదరకపోతే సంక్రాంతికి వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు. సంక్రాంతికి బాలయ్య సినిమా వస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతుందనే టాక్ ఉంది. అందుచేత అఖండ 2 ని డిసెంబర్ లో కుదరకపోతే సంక్రాంతికి రిలీజ్ చేయాలనే ఆప్షన్ కూడా పెట్టుకున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇవి కాకుండా మరి కొన్ని సినిమాలు సంక్రాంతికి వచ్చేందుకు రెడీ అవుతున్నాయని తెలిసింది. మొత్తానికి రానున్న సంక్రాంతి బాక్సాఫీస్ దగ్గర రసవత్తరంగా పోటీ ఏర్పడుతుంది అనడంలో సందేహం లేదు. మరి.. ఏ ఏ సినిమాలు పోటీపడతాయో క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.