తెలుగు సినిమా చరిత్రను తిరగేస్తే మల్టీస్టారర్ చిత్రాలకు ప్రత్యేకమైన స్థానం ఉంది. సీనియర్ తరం ఎన్టీఆర్ – ఏఎన్నార్ నుంచి మొదలుకుని, నేటి తరం రామ్ చరణ్ – జూనియర్ ఎన్టీఆర్ వరకు వచ్చిన మల్టీస్టారర్ సినిమాలు బాక్సాఫీస్‌ను షేక్ చేశాయి. అయితే చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే… టాలీవుడ్లో ఎప్పటికీ మరిచిపోలేని స్థాయిలో ఉండాల్సిన ఒక భారీ మల్టీస్టారర్ ప్రాజెక్ట్ రూపుదిద్దుకునే దశలోనే ఆగిపోయింది. ఆ సినిమా కనుక తెరకెక్కి ఉంటే, అప్పటి సినీ చరిత్రనే మార్చేసేదని ఇప్పటికీ అభిమానులు అనుకుంటుంటారు.
ప్రముఖ దర్శకుడు బి. గోపాల్ ఒక అసాధారణ ఆలోచనతో ముందుకు వచ్చారు. నటసింహం నందమూరి బాలకృష్ణ, సూపర్ స్టార్ మహేష్ బాబును అన్నదమ్ములుగా చూపిస్తూ ఒక భారీ యాక్షన్ కుటుంబ కథను తెరకెక్కించాలని ఆయన అనుకుంటున్నారు అంట. బలమైన సెంటిమెంట్, గూస్బంప్స్ తెప్పించే యాక్షన్ సన్నివేశాలు, మాస్ ప్రేక్షకులకు పూనకాలు తెప్పించే సీక్వెన్స్‌లు… ఇవన్నీ కలిపి ఒక ఫుల్ కమర్షియల్ సినిమాగా ఈ ప్రాజెక్ట్‌ను ఆయన రూపొందించారంట. తెరపై అన్న–తమ్ముడి అనుబంధం, వారి మధ్య ఎమోషన్స్, విలన్స్ తో పోరాటాలు… ఇవన్నీ కలిసి ప్రేక్షకులను కట్టిపడేసేలా ఉంటాయని బి.గోపాల్ అంటున్నారు. మాస్ కు మరో పేరు నందమూరి బాలకృష్ణ. ఆయన మాస్ ఇమేజ్ను ఆకాశానికి ఎత్తిన దర్శకుల్లో బి.గోపాల్ ఒకరు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలు టాలీవుడ్లో ఆల్ టైమ్ రికార్డులుగా నిలిచాయి. లారీ డ్రైవర్, రౌడీ ఇన్స్పెక్టర్ వంటి చిత్రాల నుంచి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన సమరసింహారెడ్డి, బాక్సాఫీస్‌ను దద్దరిల్లించిన నరసింహనాయుడు వరకు… బాలయ్య – గోపాల్ కాంబినేషన్ అంటేనే మాస్ ప్రేక్షకులకు పండుగ. అయితే ఈ విజయాల మధ్యలో వచ్చిన పల్నాటి బ్రహ్మనాయుడు పరాజయం మాత్రం బి.గోపాల్‌ను తీవ్రంగా నిరాశపరిచింది. అయినప్పటికీ బాలయ్య – గోపాల్ మధ్య ఉన్న అనుబంధం మాత్రం ఎప్పటికీ తగ్గలేదు.
ఇక సూపర్ స్టార్ మహేష్ బాబుతో బి.గోపాల్ తెరకెక్కించిన చిత్రం వంశీ. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినా, మహేష్ కెరీర్ లో మాత్రం ఒక కీలక మలుపుగా నిలిచింది. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే హీరోయిన్ నమ్రత శిరోద్కర్‌తో మహేష్ బాబుకు పరిచయం ఏర్పడింది. ఈ నేపథ్యంతోనే బి.గోపాల్, బాలకృష్ణ – మహేష్ బాబు ఇద్దరినీ ఒకే సినిమాలో చూపించాలనే ఆలోచనను మరింత గట్టిగా ముందుకు తీసుకెళ్లారు. ఈ సినిమాలో బాలయ్య అన్న పాత్రలో, మహేష్ తమ్ముడు పాత్రలో నటిస్తే తెర ఇక అభిమానులకి సెలబ్రేషన్ ఏ. కానీ డేట్ల సమస్యలు, అప్పటి మార్కెట్ పరిస్థితులు, నిర్మాణ వ్యయాల భారం వంటి అనేక కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ possible అవ్వలేదు. అలా ఒక అద్భుతమైన మల్టీస్టారర్ ఆలోచన కాగితాలకే పరిమితమైంది. అయితే అభిమానుల అభిప్రాయం మాత్రం వేరేలా ఉంది. ఒకవేళ ఈ సినిమా పట్టాలెక్కి ఉంటే, సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు కంటే ముందే టాలీవుడ్లో అతిపెద్ద మల్టీస్టారర్‌గా చరిత్ర సృష్టించేదని ఇప్పటికీ వారు నమ్ముతుంటారు. ప్రస్తుతం పరిస్థితులు చూస్తే… బాలకృష్ణ వరుస విజయాలతో మళ్లీ తన మాస్ స్టామినాను ఘనంగా నిరూపిస్తున్నారు. వయసు పెరుగుతున్నా, ఆయనలోని ఎనర్జీ మాత్రం తగ్గడం లేదు. మరోవైపు మహేష్ బాబు పాన్ వరల్డ్ స్థాయిలో అడుగులు వేస్తున్నారు. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్‌లో ఆయన నటిస్తున్నారు. ‘రుద్ర’ అనే శక్తివంతమైన పాత్రలో మహేష్ కనిపించనుండగా, గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటిస్తోంది. 2027లో విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమాపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి.