టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రామ్ పోతినేని తన పుట్టినరోజు సందర్భంగా చేసిన కొత్త ప్రకటన టాలీవుడ్ లో ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఈసారి ఆయన కేవలం హీరోగానే కాకుండా దర్శకుడిగానూ కొత్త ప్రయాణాన్ని ప్రారంభించబోతున్నారు. తన కెరీర్లో 23వ చిత్రంగా రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్‌ను ఆయనే రచించి డైరెక్ట్ చేస్తున్నారు. దీంతో ఈ ప్రాజెక్ట్‌పై అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. ప్రస్తుతం ఈ సినిమాను ‘RAPO 23’ వర్కింగ్ టైటిల్ తో పిలుస్తున్నారు. సైకాలజికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రం, రామ్ కెరీర్లో పూర్తిగా కొత్త తరహా ప్రయోగంగా నిలవబోతోందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటివరకు రామ్ ను ఎక్కువగా మాస్ యాక్షన్ హీరోగా చూసిన ప్రేక్షకులు, ఇప్పుడు ఆయనను ఒక డార్క్ ఇంకా ఇంటెన్స్ క్యారెక్టర్లో చూడబోతున్నారని తెలుస్తోంది. ఈ సినిమాలో రామ్ ‘వీరా’ అనే పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నారట. ఈ పాత్ర కోసం ఆయన ప్రత్యేకమైన లుక్‌తో ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. కథకు తగ్గట్టుగా నటీనటుల ఎంపిక, లొకేషన్స్, టెక్నికల్ టీమ్ ఎంపిక పనుల్లో చిత్రబృందం బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్ర కూడా చాలా కీలకంగా ఉండబోతుందని సమాచారం. కథ మొత్తం హీరో విలన్ మధ్య జరిగే మానసిక పోరాటం చుట్టూ తిరుగుతుందని టాక్ వినిపిస్తోంది. ఇక ఈ పాత్రలో ఎవరు కనిపిస్తారో అనే ఆసక్తి నెలకొంది. ఫఎస్.జె.సూర్య పేరు ప్రధానంగా వినిపిస్తోంది. అయితే చిత్ర బృందం నుండి అధికారిక ప్రకటన లేదు. ఇక సైకాలజికల్ థ్రిల్లర్‌లో హీరో-విలన్ మధ్య మైండ్ గేమ్స్ చాలా కీలకంగా ఉంటాయి. ఆ తరహా పాత్రలను ఎస్.జె సూర్య అద్భుతంగా చేయగలడనే నమ్మకం ప్రేక్షకుల్లో ఉంది. ఇక హీరోయిన్ విషయానికి వస్తే, ప్రస్తుతం శ్రీనిథి శెట్టి పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ‘ఒకవేళ ఈ కాంబినేషన్ ఫైనల్ అయితే రామ్, శ్రీనిధి కలిసి నటించే తొలి సినిమా ఇదే అవుతుంది. తెరపై ఈ జోడీ చాలా అద్భుతంగా ఉంటుందని ప్రేక్షకులు భావిస్తున్నారు. సినిమా కథలో హీరోయిన్ పాత్ర కూడా చాలా ముఖ్యమని తెలుస్తోంది. కేవలం పాటలకే పరిమితం కాకుండా, కథను ముందుకు నడిపించే కీలకమైన పాత్రలో హీరోయిన్ కనిపించబోతుందని టాక్ వినిపిస్తోంది. అందుకే నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్ర చేయగల హీరోయిన్ను ఎంపిక చేయాలని చిత్రబృందం భావిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా జూన్ నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని తెలుస్తోంది. ఇప్పటికే కొన్ని కీలకమైన లొకేషన్స్‌ను కూడా ఫైనల్ చేసినట్లు సమాచారం. కథ డార్క్ టోన్‌లో సాగనున్నందున, విజువల్స్ కూడా చాలా స్టైలిష్‌గా ఉండబోతున్నాయట. యాక్షన్ ఎపిసోడ్స్‌తో పాటు సైకాలజికల్ టెన్షన్‌ను కూడా దర్శకుడు రామ్ చాలా కొత్తగా చూపించబోతున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే, రామ్ ఈ సినిమాతో దర్శకుడిగా మారడం. హీరోలు దర్శకులుగా మారడం కొత్త విషయం కాదు. కానీ ఒక పెద్ద కమర్షియల్ హీరో తన కెరీర్లో ఇలాంటి కీలక సమయంలో స్వయంగా కథ రాసుకుని, దానిని డైరెక్ట్ చేయడం మాత్రం ఆసక్తికరంగా మారింది. ఇది రామ్‌లో ఉన్న మరో కోణాన్ని ప్రేక్షకులకు చూపించబోతోందని అభిమానులు భావిస్తున్నారు. డిసెంబర్ లో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.