ఆకట్టుకుంటోన్న “మహావతార్ పరశురామ్” లేటెస్ట్ అప్డేట్

Spread the love

ఏ కాలంలో నైనా  భారతీయ పురాణాల ఆధారంగా రూపొందుతున్న సినిమాలకు ప్రేక్షకులు బ్రహ్మ రథం పట్టిన సందర్భాలే ఎక్కువ.  ఎప్పటినుంచో ఇటువంటి చిత్రాలకు ప్రేక్షకాదరణ విశేషంగా ఉంది. అయితే ఆ కథలను ఆధునిక సాంకేతికతతో, వరల్డ్ స్టాండర్డ్ విజువల్స్‌తో చూపించడం మాత్రం ఇటీవలి కాలంలోనే బాగా పెరిగింది. ‘మహావతార్ నరసింహ’ చిత్రం ఏ స్థాయిలో విజయం సాధించిందో తెలిసిందే కదా. ఇప్పుడు ఈ యూనివర్స్‌లో రెండో చిత్రంగా ‘మహావతార్ పరశురాం’ అధికారికంగా ప్రకటించబడింది. పరశురామ జయంతి సందర్భంగా విడుదలైన ఈ సినిమా మోషన్ పోస్టర్ ఇప్పటికే సోషల్ మీడియాలో మంచి స్పందన లభించింది. ఈ ప్రాజెక్ట్‌ను రూపొందిస్తున్నది అశ్విన్ కుమార్. ఆయన దర్శకత్వంలో వచ్చిన “మహావతార్ నరసింహ” బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సత్తా చాటింది. థియేటర్లలోనే కాకుండా ఓటీటీలో కూడా భారీ వ్యూస్ సాధించింది. దీంతో ఇప్పుడు మహావతార్ సినిమాటిక్ యూనివర్స్”పై ప్రేక్షకుల అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ఆ అంచనాలకు తగ్గట్టే ఇప్పుడు “మహావతార్ పరశురామ్” చిత్రాన్ని రూపొందిస్తున్నారు. తాజాగా విడుదల చేసిన  టైటిల్ రివీల్ మోషన్ పోస్టర్‌ ఆకట్టుకుంటోంది. క్యాప్షన్ కూడా చాలా ప్రభావవంతంగా ఉంది. “లోకంలో ధర్మం నశించినప్పుడు, అధర్మాన్ని ఎదుర్కొనే శక్తిగా పరశురాముడు సమతుల్యతను తిరిగి స్థాపిస్తాడని పేర్కొన్నారు. ఈ చిత్రాన్నిహోంబలే ఫిలిమ్స్ సమర్పణలో, Kleem Productions బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఇప్పటికే భారీ చిత్రాలను నిర్మించి మంచి పేరు తెచ్చుకున్న హోంబలే ఫిల్మ్స్ ఈ ప్రాజెక్ట్‌కు బ్యాకింగ్ ఇవ్వడం కూడా ఈ సినిమాపై నమ్మకాన్ని పెంచుతోంది. “మహావతార్ పరశురామ్”ను 2027 డిసెంబర్‌లో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. “మహావతార్ నరసింహ”తో ప్రారంభమైన ఈ ప్రయాణం ఇప్పుడు “మహావతార్ పరశురామ్”తో మరింత ఆసక్తిని పెంచుతోంది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *