తమిళ స్టార్ హీరో సూర్య, యువ నటిమమిత బైజు కలయికలో తెరకెక్కుతున్న తాజా చిత్రం విశ్వనాథన్ అండ్ సన్స్ ఇప్పటికే సినీ ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేకెత్తిస్తోంది. దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్ సినిమా తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు వెంకీ అట్లూరి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండటంతో, ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు మరింత పెరిగాయి. ఇప్పటికే షూటింగ్ దాదాపు పూర్తి కావడంతో, ఈ సినిమాను జూలైలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ సిద్ధమవుతున్నారు. ఇటీవల ఈ చిత్రం నుంచి సూర్య ఫస్ట్ లుక్‌ను విడుదల చేసిన మేకర్స్, ఇప్పుడు టీజర్‌ను విడుదల చేసి సినిమా కాన్సెప్ట్‌పై ఒక క్లారిటీ ఇచ్చారు. ఈ టీజర్ విడుదలైన వెంటనే సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, సినిమా కథపై పెద్ద చర్చకు దారి తీసింది. ముఖ్యంగా ఈ సినిమాలో చూపించిన ప్లాట్ చాలా భిన్నంగా ఉండటంతో, ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది.
టీజర్లో సూర్య పోషిస్తున్న సంజయ్ విశ్వనాథ్ పాత్ర చాలా ప్రత్యేకంగా కనిపిస్తోంది. టీజర్లో కనిపించిన విజువల్స్ కూడా చాలా గ్రాండ్‌గా, రియలిస్టిక్‌గా ఉన్నాయి. ప్రతి ఫ్రేమ్‌లో కూడా ఒక భావం కనిపిస్తోంది. ముఖ్యంగా సూర్య నటన మరోసారి ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేలా కనిపిస్తోంది. తన పాత్రలోని ప్రతి భావాన్ని చాలా సహజంగా వ్యక్తపరుస్తూ, ఈ సినిమా మీద అంచనాలను మరింత పెంచాడు. ఇక సంగీత దర్శకుడు జీ.వీ.ప్రకాష్ కుమార్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ టీజర్‌కు మరో పెద్ద ప్లస్ పాయింట్‌గా నిలిచింది. ప్రతి సన్నివేశానికి తగిన విధంగా వచ్చిన సంగీతం భావోద్వేగాలను మరింతగా ఎలివేట్ చేస్తోంది. విజువల్స్‌తో కలిసిపోయి, టీజర్‌ను మరింత ప్రభావవంతంగా మార్చింది. మొత్తం మీద చూస్తే ఈ సినిమా ఒక కొత్త తరహా ప్రేమకథతో, బలమైన భావోద్వేగాలతో, ప్రేక్షకుల ముందుకు రాబోతోందని స్పష్టంగా తెలుస్తోంది. సూర్య నటన, వెంకీ అట్లూరి దర్శకత్వం, జీవీ ప్రకాష్ సంగీతం అన్ని కలిసి ఈ సినిమాను ప్రత్యేకంగా నిలబెట్టేలా కనిపిస్తున్నాయి. ఇక జూలైలో విడుదల కానున్న ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి!