ఇది కదా మన వెంకీ మామ అంటే…

Spread the love

దశాబ్దాలుగా తన నటనతో ఎన్నో విలక్షణ పాత్రలతో ఆకట్టుకున్నారు సీనియర్ నటుడు విక్టరీ వెంకటేష్ అందరి హీరోలతో తన బంధం ఎంత బలంగా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఎంతో వినయంగా, పద్దతిగా ఉంటూ మంచి పేరు తెచ్చుకున్న ఆయన గురించి మరో విషయం ఆయనపై మరింత గౌరవం పెంచేలా చేసింది. వివరాల్లోకి వెళితే 

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటించిన దృశ్యం సిరీస్‌ కు ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉంది. దర్శకుడు జీతూ జోసెఫ్ అద్భుతంగా తెరకెక్కించారు. ఫ్యామిలీ ఎమోషన్స్, సస్పెన్స్, ట్విస్టులు అన్ని కలిపి ఒక అద్భుతమైన కథను ప్రేక్షకులకు అందించారు. ఇప్పటివరకు వచ్చిన రెండు భాగాలు భారీ విజయాన్ని సాధించాయి. ఇప్పుడు మూడో భాగం కూడా అదే స్థాయిలో ఉంటుందనే నమ్మకం అభిమానుల్లో ఉంది. ఈ నేపథ్యంలో దృశ్యం 3 ప్రమోషన్స్‌ లో భాగంగా నటి ఈస్తర్ అనిల్ కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ఆమె చెప్పిన ఒక సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది తెలుగు దృశ్యం రీమేక్ సమయంలో జరిగిన విషయం. తెలుగులో ఈ సినిమాను సీనియర్ అగ్రనటుడు విక్టరీ వెంకటేష్ ప్రధాన పాత్రలో కనిపించారు. మలయాళ ఒరిజినల్‌ లో నటించిన మీనా, ఎస్తేర్ అనిల్ కూడా తెలుగులో అదే పాత్రలను చేశారు. ఈ సందర్భంగా షూటింగ్ సమయంలో జరిగిన ఒక సంఘటన గురించి ఎస్తేర్ గుర్తు చేసుకున్నారు. ఆమె చెప్పినదాని ప్రకారం… దృశ్యం సినిమాలో ఒక చాలా కీలకమైన సీన్ ఉంటుంది. అది ఇంటర్వెల్ బ్లాక్‌లో వచ్చే సీన్. ఆ సన్నివేశంలో మోహన్ లాల్ పాత్రను ఒక వ్యక్తి కొడతాడు. కింద పడిపోయిన తర్వాత, అతను లేచి నిలబడి తన కుటుంబాన్ని చూసి ఒక చిన్న నవ్వు నవ్వుతాడు. ఆ నవ్వులో బాధ, బాధ్యత, ప్రేమ అన్ని కలిసిపోయి ఉంటాయి. అది చాలా ఎమోషనల్, హార్ట్ బ్రేకింగ్ సీన్. ఈ సీన్ గురించి తెలుగులో షూటింగ్ చేస్తున్నప్పుడు, దర్శకురాలు శ్రీప్రియ వెంకటేష్‌ కు వివరించారట. అప్పుడు వెంకటేష్ చాలా వినయంగా స్పందించారని ఎస్తేర్ తెలిపారు. “అమ్మా… నేను మోహన్ లాల్ లాగా చేయలేను. అది ఆయనకే సాధ్యం. నేను నా స్టైల్‌లో చేస్తాను” అని ఆయన చెప్పారట. ఈ మాటలు చెప్పిన వెంకటేష్ గొప్పతనాన్ని ఎస్తేర్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఒక పెద్ద స్టార్ హీరో అయ్యి కూడా, మరో నటుడి ప్రతిభను అలా అంగీకరించడం చాలా అరుదు. సాధారణంగా ప్రతి హీరో తనదైన స్టైల్‌లో నటించాలని చూస్తారు. కానీ ఇక్కడ వెంకటేష్, మోహన్ లాల్ నటనను గౌరవిస్తూ మాట్లాడడం ఆయన వినయాన్ని చూపిస్తుంది.

ఈ సంఘటన ఇప్పుడు అభిమానులను ఆకట్టుకుంటోంది. ఇద్దరు పెద్ద నటుల మధ్య ఉన్న పరస్పర గౌరవాన్ని ఈ ఘటన ప్రతిబింబిస్తోంది. దృశ్యం సినిమాలు కేవలం మలయాళంలో మాత్రమే కాదు, ఇతర భాషల్లో కూడా రీమేక్ అయి విజయాన్ని అందుకున్నాయి. తెలుగు, తమిళం, హిందీ ఇలా అన్ని భాషల్లో ఈ కథ ప్రేక్షకులను మెప్పించింది. ప్రతి భాషలో కూడా ఈ కథకు మంచి స్పందన వచ్చింది. ఈ సినిమా 3వ పార్ట్ మే 21న విడుదల కానుంది. ఇప్పటికే చిత్ర బృందం టీజర్‌ను విడుదల చేసింది. ఆ టీజర్‌కు మంచి స్పందన వస్తోంది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *