ఘనంగా “అమరావతికి ఆహ్వానం” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్

Spread the love
Oplus_16908288

“అమరావతికి ఆహ్వానం” ప్రీ రిలీజ్ ఈవెంట్: శివ కంఠంనేని, ధ‌న్య బాల‌కృష్ణ‌, ఎస్తేర్, సుప్రిత, హ‌రీష్ ప్ర‌ధాన తారాగణంగా తెరకెక్కిన సినిమా “అమరావతికి ఆహ్వానం”. ఈ మూవీలో సీనియ‌ర్ న‌టులు అశోక్ కుమార్‌, భ‌ద్ర‌మ్‌, జెమిని సురేష్, నాగేంద్ర ప్రసాద్ ఇతరులు కీల‌క‌ పాత్ర‌లు పోషించారు. డైరెక్ట‌ర్ జీవీకే ఈ మూవీని తెరకెక్కించారు. ప్ర‌ముఖ నిర్మాత ముప్పా వెంక‌య్య చౌద‌రి గారి నిర్మాణ సార‌థ్యంలో జి. రాంబాబు యాద‌వ్ స‌మ‌ర్పణ‌లో లైట్ హౌస్ సినీ మ్యాజిక్ బేన‌ర్‌పై కేఎస్ శంక‌ర్‌రావు, ఆర్ వెంక‌టేశ్వ‌ర రావు ఈ సినిమాను నిర్మించారు.ఈ సినిమా ఫిబ్రవరి 13న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. చిత్ర బృందం ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్య‌క్ర‌మంలో ముఖ్య అతిధులుగా ప్ర‌ముఖ న‌టులు, నిర్మాత ముర‌ళి మోహ‌న్‌గారు, యంగ్ హీరో అశ్విన్ బాబు హాజ‌ర‌య్యారు.

హీరోయిన్ సుప్రిత మాట్లాడుతూ “అమరావతికి ఆహ్వానం సినిమాలో నేనొక ఇంపార్టెంట్ రోల్ చేశాను. నేను బయట ఎంత అల్లరిగా, సరదాగా ఉంటానో ఈ సినిమాలోనూ అలాంటి క్యారెక్టర్ చేశాను. ఈ పాత్రకు నేను బాగా రిలేట్ అయ్యాను. ఈ చిత్రంలో నటిస్తున్నప్పుడు ధన్య, ఎస్తేర్ గారు మంచి ఫ్రెండ్స్ అయ్యారు. శివ గారితో వర్క్ చేయడం హ్యాపీగా ఉంది.” అని అన్నారు.”అమరావతికి ఆహ్వానం” ప్రీ రిలీజ్ ఈవెంట్

హీరోయిన్ ఎస్తేర్ మాట్లాడుతూ “మంచి కథతో చేసిన చిత్రమిది. నేను కూడా మీతో పాటు ఈ నెల 13న థియేటర్స్ లో సినిమా చూడబోతున్నా. మా అందరికీ ఎగ్జైటింగ్ గా ఉంది. మూవీ తప్పకుండా మీకు నచ్చుతుందని నమ్ముతున్నాం.” అని అన్నారు.

హీరోయిన్ ధన్య బాలకృష్ణ మాట్లాడుతూ “మీ కళ్లు బాగుంటాయి, రొమాంటిక్ మూవీస్ చేయండి, ట్రెడిషనల్ ఫ్యామిలీ మూవీస్ చేయండి అని అంటుంటారు కానీ మా డైరెక్టర్ జీవీకే మీ కళ్లు బాగుంటాయి మీరు హారర్ మూవీ చేయాలని వచ్చారు. నేను రాజా రాణి మూవీ చేసినప్పుడు అట్లీ గారు ఎంత టాలెంటెడ్ గా అనిపించారో ఈ సినిమా చేశాక జీవీకే గారిపై అలాంటి అభిప్రాయమే కలిగింది. అమరావతికి ఆహ్వానం సినిమాలో మంచి కంటెంట్ ఉంది. మీరంతా థియేటర్స్ కు వచ్చి చూసి ఎంజాయ్ చేయండి.” అన్నారు.

హీరో అశ్విన్ బాబు మాట్లాడుతూ “అమరావతికి ఆహ్వానం సినిమా ట్రైలర్ చాలా బాగుంది. ట్రైలర్ తోనే సినిమా చూడాలనే ఆసక్తిని డైరెక్టర్ గారు క్రియేట్ చేశారు. ముగ్గురు హీరోయిన్స్ తో ఇలాంటి మూవీ చేయడం సులువైన పని కాదు. మేము రాజు గారి గది సినిమా చేసినప్పుడు ఇలాంటి చిన్న బడ్జెట్ తోనే చేశాం. ఆ మూవీని మీరంతా ఆదరించారు. ఈ చిత్రానికి కూడా అలాంటి సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. ముగ్గురు హీరోయిన్స్ ఎస్తేర్, ధన్య, సుప్రిత, హీరో శివ గారికి ఆల్ ది బెస్ట్.” అని అన్నారు.