బీసీసీఐ ఇయర్లీ కాంట్రాక్టుల్లో సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలకు గ్రేడ్ బి కాంట్రాక్టు దక్కింది. వన్డే క్రికెట్లో మాత్రమే కొనసాగుతున్న నేపథ్యంలో వాళ్లకు గ్రేడ్ బి కాంట్రాక్ట్ కేటాయించింది. ఎ+ కేటగిరిని బీసీసీఐ రద్దు చేసింది. బోర్డు మొత్తం 30 మంది మెన్స్ , 21 మంది మహిళా క్రికెటర్లకు వార్షిక సెంట్రల్ కాంట్రాక్టులను తాజాగా తెలిపింది. టెస్టు, వన్డేలకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్న కెప్టెన్ శుభ్ మన్ గిల్, సీనియర్ పేసర్ బుమ్రా, ఆల్ రౌండర్ జడేజాలకు ఎ గ్రేడ్ లభించింది. వివిధ గ్రేడ్ల కింద ఎంత చెల్లించేది బీసీసీఐ వెల్లడించలేదు. కిందటి సీజన్ వరకు ఎ, బి, సి గ్రేడ్లలోని ఆటగాళ్లు వరుసగా రూ.5 కోట్లు, రూ.3 కోట్లు, రూ.1 కోటి లభించేది. నితీశ్ కుమార్ రెడ్డికి గ్రేడ్ సి కాంట్రాక్ట్ దక్కింది. మహిళ విభాగంలో కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, దీప్తి శర్మ, స్మృతి మంధానలు ‘ఏ’ గ్రేడ్ లో కొనసాగుతున్నారు. వరల్డ్ కప్ లో అదరగొట్టిన జెమీమాకు ‘బి నుంచి ‘ఎ’కు ప్రమోషన్ లభించింది. స్నేహ్ రాణా, షెఫాలి వర్మ, రిచా ఘోష్, రేణుక సింగ్‌లకు గ్రేడ్ ‘బి’ కాంట్రాక్ట్ లో ఉన్నారు. గ్రేడ్ సి లో శ్రీచరణి, అరుంధతి రెడ్డి, రాధ, అమనోజోత్, ప్రతీక, ఉమ, క్రాంతి, యాస్తిక, హర్లీన్, కష్వీ, కమలిని, వైష్ణవి, తేజల్ ఉన్నారు.
GRADE A: గిల్, బుమ్రా, జడేజా
GRADE B: కోహ్లి, రోహిత్, సుందర్, రాహుల్, సిరాజ్, హార్దిక్, రిషభ్ పంత్, కుల్దీప్, యశస్వి జైస్వాల్, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్
GRADE C: అక్షర్ పటేల్,సంజు శాంసన్, తిలక్ వర్మ, రింకు సింగ్, శివమ్ దూబె, అర్షీప్, ప్రసిద్ధ కృష్ణ, ఆకాశ్ దీప్, ధ్రువ్ జురెల్, రవి బిష్ణోయి, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, నితీశ్ కుమార్ రెడ్డి, అభిషేక్ శర్మ, సాయి సుదర్శన్, రుతురాజ్ గైక్వాడ్.