దూత 2 … మరింత ఆసక్తికరంగా…

Spread the love

యువ సామ్రాట్‌ గా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న అక్కినేని నాగచైతన్య నటించిన తొలి వెబ్ సిరీస్ ‘దూత’ ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో ప్రేక్షకులందరికీ తెలిసిందే. అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా విడుదలైన ఈ సస్పెన్స్ థ్రిల్లర్, కథనం-నటనల పరంగా విపరీతమైన ప్రశంసలు అందుకుని చైతన్య కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలిచింది. థియేటర్ సినిమాలకు భిన్నంగా, గాఢమైన emotions, మిస్టరీతో నిండిన ఈ సిరీస్ ప్రేక్షకులను మొదటి ఎపిసోడ్ నుంచే ఉత్కంఠలో ముంచెత్తింది. ఇప్పుడు అదే విజయాన్ని మరింత పెద్ద స్థాయిలో కొనసాగించేందుకు ‘దూత సీజన్ 2’ పనులు వేగంగా సాగుతుండటం అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది.

మొదటి సీజన్‌లో ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ సాగర్ పాత్రలో నాగచైతన్య చూపించిన నటన ప్రశంసలు అందుకునేలా ఉంది. ఇప్పటి వరకు కనిపించని తీవ్రమైన ఎమోషన్స్, మెంటల్ స్ట్రెంగ్త్ తో ఆయన ఎంతో సహజంగా నటించారు. దర్శకుడు విక్రమ్ కె. కుమార్ తన ప్రత్యేక మేకింగ్ స్టైల్‌తో కథను ఉత్కంఠభరితంగా నడిపిస్తూ ప్రతి ఎపిసోడ్‌ను ఆసక్తికరంగా మలిచారు. థ్రిల్లింగ్ స్క్రీన్‌ప్లే, మలుపులు, సూపర్‌నేచురల్ టచ్ అని కలిసి ‘దూత’ను సాధారణ వెబ్ సిరీస్‌లకు భిన్నంగా నిలబెట్టాయి. తాజా సమాచారం ప్రకారం, రెండో సీజన్‌కు సంబంధించిన కథా రచన ఇప్పటికే పూర్తయిందని, ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు హైదరాబాద్‌లో జోరుగా కొనసాగుతున్నాయని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. మొదటి భాగం సాధించిన ఘన విజయాన్ని దృష్టిలో పెట్టుకుని, ఈసారి కథను మరింత విస్తృతంగా, మరిన్ని ట్విస్ట్‌లు ఇంకా అతీత శక్తుల నేపథ్యంతో రూపొందించేందుకు మేకర్స్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని తెలుస్తోంది. ఇక నాగచైతన్య ప్రస్తుత ప్రాజెక్టుల విషయానికి వస్తే, ఆయన దర్శకుడు కార్తీక్ దండు తెరకెక్కిస్తున్న ‘వృషకర్మ’ చిత్ర షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా పూర్తయ్యాక, అంటే 2026 సెకండ్ హాఫ్ లో ‘దూత 2’ చిత్రీకరణ ప్రారంభమయ్యే అవకాశముందని సమాచారం. మొత్తంగా చూస్తే, ఒకవైపు సినిమాలు… మరోవైపు వెబ్ సిరీస్‌లతో నాగచైతన్య 2026లో ప్రేక్షకులను విభిన్న రూపాల్లో అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రత్యేకమైన కథలను ఎంచుకుంటూ తన నటుడిగా పరిధిని విస్తరించుకుంటున్న ఆయన ప్రయాణంలో ‘దూత సీజన్ 2’ మరో కీలక అధ్యాయంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. విక్రమ్ కుమార్ తన ప్రత్యేకమైన కథనశైలితో ఈసారి కూడా ప్రేక్షకుల వెన్నులో వణుకు పుట్టించే థ్రిల్లింగ్ అనుభూతిని అందిస్తారనే నమ్మకంతో అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.