నాగ చైతన్య ‘వృషకర్మ’ సినిమాకు ప్రేక్షకుల్లో మంచి క్రేజ్  

Spread the love

నాగ చైతన్య ‘వృషకర్మ’ అనే సినిమాతో ప్రేక్షకులను ఆశ్చర్యపరచడానికి సిద్ధమవుతున్నారు. ఈ చిత్రానికి దర్శకుడిగా వ్యవహరిస్తున్న కార్తీక్ దండు  ఇప్పటికే తన తొలి చిత్రం ‘విరూపాక్ష’ తో టాలీవుడ్‌లో భారీ సెన్సేషన్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. ఆ సినిమా మిస్టికల్ థ్రిల్లర్‌గా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుని బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పటివరకు విడుదలైన ఈ సినిమా గ్లింప్స్, పోస్టర్లు ప్రేక్షకులలో ఆసక్తిని పెంచాయి. ముఖ్యంగా విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, మిస్టరీ ఎలిమెంట్స్ కలిసి సినిమాకు ఒక ప్రత్యేకమైన థ్రిల్లర్ ఫీల్‌ను తీసుకొచ్చాయి. ఈ గ్లింప్స్ విడుదలైన తర్వాతే ఇండస్ట్రీలో ఈ సినిమాపై పెద్ద చర్చ మొదలైంది. ముఖ్యంగా కథలో ఉన్న అతీంద్రియ శక్తులు, మిస్టరీ అంశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని చెప్పుకుంటున్నారు. ‘వృషకర్మ’ థియేట్రికల్ హక్కుల కోసం అనేక మంది ప్రముఖ డిస్ట్రిబ్యూటర్లు పోటీ పడ్డారని తెలుస్తోంది. ‘తండేల్’ వంటి భారీవిజయం  తర్వాత ఆయన నటిస్తున్న సినిమా కావడం వల్ల ఈ మూవీకి క్రేజ్ కనిపిస్తోంది. సినిమా కథ విషయానికి వస్తే, ఇది అతీంద్రియ శక్తులు మిస్టరీ అంశాల చుట్టూ తిరిగే అడ్వెంచరస్ థ్రిల్లర్‌గా రూపొందుతోందని తెలుస్తోంది. గుహల్లో జరిగే అన్వేషణ, గబ్బిలాలతో కూడిన సన్నివేశాలు, మిస్టరీ వాతావరణం అన్ని కలిసి సినిమాకు ఒక ప్రత్యేకమైన అనుభూతిని ఇవ్వనున్నాయి. ఈ కథలో నాగచైతన్య పూర్తిగా కొత్త అవతారంలో కనిపించనున్నారని సమాచారం. పాత్రకు తగ్గట్టు ఆయన తన లుక్‌ను కూడా పూర్తిగా మార్చుకోవడం విశేషం. ఇంతవరకు ఆయనను చూసిన విధంగా కాకుండా, చాలా సాహసోపేతమైన పాత్రలో కనిపించనున్నారని మేకర్స్ చెబుతున్నారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. సంగీత దర్శకుడిగా అజనీష్ లోక్ నాథ్  పనిచేస్తున్నారు. అలాగే ఈ భారీ ప్రాజెక్ట్‌ను SVCC మరియు Sukumar Writings సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మొత్తానికి నాగచైతన్య ఇప్పటివరకు చేసిన సినిమాల కంటే పూర్తిగా భిన్నమైన జోనర్‌లో వస్తున్న ‘వృషకర్మ’ ఇప్పటికే విడుదలకు ముందే భారీ హైప్ క్రియేట్ చేస్తోంది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *