2014 నుంచి దేశంలో విమానాశ్రయాల సంఖ్య పెరిగింది:కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు 

Spread the love

2014 నుంచి దేశంలో విమానాశ్రయాల సంఖ్య రెండింతలు కంటే ఎక్కువగా పెరిగిందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. ప్రధాని మోడీ  వికసిత్ భారత్ 2047 విజన్‌తో ఈ సంఖ్య మరింతగా పెరుగనుందని పేర్కొన్నారు. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) ఒక మినీరత్న సంస్థగా ప్రతి సంవత్సరం ₹5500 కోట్లకు పైగా మూలధన వ్యయంతో దేశవ్యాప్తంగా అనేక ప్రాజెక్టులను అమలు చేస్తోందని తెలిపారు.  ఈ ప్రాజెక్టుల అమలులో సమయపాలనతో పాటు పనుల నాణ్యతను నిరంతరం పర్యవేక్షించడం అత్యంత ముఖ్యమని ఈ నేపథ్యంలో మెరుగైన ప్రాజెక్ట్ నిర్వహణ మరియు సమగ్ర పర్యవేక్షణ కోసం ఒక డిజిటల్ పోర్టల్ మరియు మొబైల్ యాప్‌ను ప్రారంభించారు.  అలాగే ఈ యాప్ వినియోగంపై కార్యనిర్వాహక అధికారులు, సిబ్బందికి అవగాహన కల్పించేందుకు ఒక రోజంతా వర్క్‌షాప్ కూడా నిర్వహించారు. ఇకపై ఈ సాంకేతిక సాధనాలను విస్తృతంగా వినియోగించి AAI ప్రాజెక్టుల అమలులో మరింత మెరుగైన ఫలితాలు సాధించాలని అధికారులకు సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *