ప్రముఖ నటి అలియా భట్ కు అంతర్జాతీయ గౌరవం

Spread the love

ప్రముఖ నటి అలియా భట్ కు మరోసారి అంతర్జాతీయ గౌరవం లభించింది.బ్రిటిష్ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఆర్ట్స్ (బాఫ్టా) 79వ ఎడిషన్ అవార్డులను  అందించే ప్రెజెంటర్ల జాబితాను ప్రకటించింది. అందులో మన దేశం నుండి  అలియా భట్ పాల్గొననున్నారు. గతంలో ప్రియాంక చోప్రా, దీపికా పదుకొణెలకు ఈ గౌరవం లభించింది. ఈకార్యక్రమం లండన్ లోని  రాయల్ ఫెస్టివల్ హాల్లో ఫిబ్రవరి 22న జరగనుంది. బాఫ్టా అవార్డుల నామినేషన్లలో బెస్ట్ చిల్డ్రన్ అండ్ ఫ్యామిలీ విభాగం నుంచి మణిపురి చిత్రం ‘బూంగ్’ నామినేట్ అయింది. తల్లిని బహుమతితో ఆశ్చర్యపరచాలని ప్రయత్నించే బూంగ్ అనే బాలుడి కథాంశంతో ఈ చిత్రం రూపొందింది. దీంతో దర్శకురాలు లక్ష్మీ ప్రియదేవి కూడా ఈ వేడుకకి హాజరవనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాని ఫర్హాన్ అక్తర్, రితేష్ సిధ్వాని తదితరులు సంయుక్తంగా నిర్మించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *