తనదైన నటనతో డిఫరెంట్ స్టోరీస్ తో ఆకట్టుకునే సినిమాలు చేసే హీరో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ లు జోడీగా నటించిన ‘డెకాయిట్’ చిత్రం ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. కాగా, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ సాధించింది. ప్రేక్షకుల ఆదరణతో విజయవంతంగా దూసుకుపోతోంది. నిన్న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా, మొదటి రోజు రూ.15 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లు సినిమా నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ అధికారికంగా ప్రకటించింది. ఈ కలెక్షన్లతో ‘డెకాయిట్’ అడివి శేష్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ తెచ్చిన సినిమాగా నిలిచింది. షనీల్ డియో దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్‌ను తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కించారు. వీకెండ్ కావడంతో కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ సినిమాలో అనురాగ్ కశ్యప్, ప్రకాష్ రాజ్, అతుల్ కులకర్ణి తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించారు.