కాలుష్య నివారణ కోసం ఢిల్లీ కీలక చర్యలు..2028 నుండి ఆ వెహికల్స్ రిజిస్ట్రేషన్స్ బంద్

Spread the love

ఢిల్లీలో పొల్యూషన్ కంట్రోల్ చేసేందుకు ప్రభుత్వం కీలక చర్యలు తీసుకోనుంది. పొల్యూషన్ ను కంట్రోల్ చేసే దిశగా కీలక అడుగులు వేస్తోంది.  ప్రజలు ఎలెక్ట్రిక్ వెహికల్స్ వైపు వెళ్లే విధంగా కార్యాచరణ రెడీ చేస్తోంది. ఈ క్రమంలో ఎలక్ట్రిక్ వెహికిల్ ముసాయిదా పాలసీ (2026-30)ని ఢిల్లీ ప్రభుత్వం తాజాగా విడుదల చేసింది. వచ్చే ఏడాది జనవరి ఒకటి నుండి ఎలక్ట్రిక్ త్రీ వీలర్ల రిజిస్ట్రేషన్ కు మాత్రమే పర్మిషన్ ఉంటుంది. ఆ తర్వాత టూవీలర్స్ ఆ లిస్టు లోకి  తీసుకువస్తారు. ఏప్రిల్ 1, 2028 నుండి  ఎలక్ట్రిక్ మోడల్స్ రిజిస్ట్రేషన్ను మాత్రమే అనుమతించనున్నారు. ప్రజలను ఎలెక్ట్రికల్ వెహికల్స్ వినియోగించే దిశగా మళ్లించేందుకు ప్రోత్సాహకాలను ఢిల్లీ రవాణా శాఖ ప్రతిపాదించింది. ఆ వెహికల్స్ వాడితే ఎలెక్ట్రిసిటీ వాడకం పెరుగుతుంది.కాబట్టి రూ.2.25 లక్షల విలువైన టూవీలర్ కొంటే.. ఒక కిలోవాట్ అవర్ కు రూ.10వేల నుండి  రూ.30 వేల వరకు ప్రోత్సాహకం అందనుంది. త్రీవీలర్ ఈవీలకు తొలి ఏడాది రూ.50వేలు లభిస్తాయి. మెల్లిగా ఆ మొత్తం తగ్గుతూ వస్తుంది. పాత వెహికల్స్ స్క్రాప్ గా మార్చి, ఈవీల్లోకి మారినా ఈ ప్రోత్సాహకాలు దక్కుతాయి. ఈవీల కోసం ప్రభుత్వం ఛార్జింగ్ ఫెసిలిటీస్ కూడా  భారీగా పెంచనుంది. కొత్త ప్రతిపాదనలను అభిప్రాయ సేకరణ కోసం 30 రోజుల పాటు ప్రజలకు అందుబాటులో ఉంచారు. ఢిల్లీ నగరంలో పెట్రోల్, డీజిల్ వాహనాలను క్రమంగా తగ్గించడమే ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది. పర్యావరణ పరిరక్షణతో పాటు  ప్రజల ఆరోగ్యం కూడా ముఖ్యం కాబట్టి ఢిల్లీ త్వరలో కాలుష్య రహితంగా మారాలని పర్యావరణ ప్రేమికులు ఆకాంక్షిస్తున్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *