విక్టరీ వెంకటేష్ కథానాయకుడిగా త్రివిక్రమ్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆదర్శ కుటుంబం’. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాను అక్టోబర్ 2న విడుదల చేయాలనే టార్గెట్ పెట్టుకున్నారని అంటున్నారు. అయితే ఈ రిలీజ్ డేట్ అధికారికంగా ఇంకా ప్రకటించలేదు. ముందుగా షూటింగ్ పూర్తి చేసి, తరువాత వేసవి నుంచి ప్రమోషన్స్‌ను ప్రారంభించాలని టీమ్ ప్లాన్ చేస్తోందని టాక్. ఈ సినిమా టైటిల్ చూస్తే చాలా సాఫ్ట్‌గా, ఫ్యామిలీ ఎమోషన్స్‌తో నిండిన కథలా అనిపిస్తుంది. కానీ టైటిల్‌తో పాటు ఉన్న AK-47 క్యాప్షన్ చూస్తే మాత్రం ఇందులో యాక్షన్ ఎలిమెంట్స్ కూడా బలంగా ఉంటాయని అర్థమవుతోంది. ఫిల్మ్ నగర్ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం సినిమా మొదటి భాగం పూర్తిగా సరదాగా సాగుతుందట. మల్లీశ్వరి, నువ్వు నాకు నచ్చావ్’ తరహాలో కుటుంబం చుట్టూ తిరిగే హాస్యభరితమైన సన్నివేశాలతో ప్రేక్షకులను ఎంజాయ్ చేయించేలా ట్రీవిక్రమ్ స్క్రీన్‌ప్లే రూపొందించారట. అయితే ఇంటర్వెల్ బ్లాక్ దగ్గర కథలో ఒక పెద్ద ట్విస్ట్ వచ్చేలా ప్లాన్ చేశారని వినికిడి. ఆ మలుపు తర్వాత కథా స్పీడ్ ని పూర్తిగా మారిపోతుందని, అక్కడి నుంచి సినిమా టోన్ సీరియస్‌గా మారి యాక్షన్ మోడ్‌లోకి వెళ్లిపోతుందని చెబుతున్నారు. ఈ భాగంలో ‘అతడు’ తరహా ట్రీట్మెంట్తో ట్రీవిక్రమ్ తన ప్రత్యేక శైలిని మరోసారి చూపించబోతున్నారని యూనిట్ దగ్గర నుంచి లీకులు వినిపిస్తున్నాయి.
ఈ కాంబినేషన్ కోసం చాలా సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న మూవీ లవర్స్‌కు ఈ సినిమా మంచి ట్రీట్ ఇవ్వబోతుందనే నమ్మకం కూడా వ్యక్తమవుతోంది. ఇక ఆదర్శ కుటుంబం సినిమాకు సంగీతం కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతోందట. హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నారు. ఇప్పటికే అర్జున్ రెడ్డి, యానిమల్ వంటి సినిమాలతో తన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో మంచి పేరు తెచ్చుకున్న ఆయన, ఈ సినిమాలో కూడా యాక్షన్ ఇంకా ఎమోషన్ ను బలంగా ఎలివేట్ చేసే సంగీతాన్ని అందిస్తున్నారని టాక్. మొత్తానికి ఫ్యామిలీ డ్రామా, యాక్షన్, కామెడీ, ఎమోషన్ అన్నీ కలిపిన పర్ఫెక్ట్ కమర్షియల్ ఎంటర్టైనర్గా ఆదర్శ కుటుంబం ప్రేక్షకుల ముందుకు రాబోతోందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.