రజిని సినిమాలో షారుఖ్ ఖాన్… బాలీవుడ్ కూడా బద్దలవ్వాల్సిందే

Spread the love

భారతీయ సినీ పరిశ్రమలో స్టార్‌ల మధ్య ఉన్న గౌరవం, స్నేహం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. అలాంటి అరుదైన ఉదాహరణలలో ఒకటి షారుక్ ఖాన్ , కమల్ హాసన్ మరియు రజనీకాంత్ మధ్య ఉన్న అనుబంధం. ఒకరికి ఒకరు సహాయం చేస్తూ, అవసరమైనప్పుడు సినిమాల్లో ప్రత్యేక పాత్రలు చేయడం ద్వారా ఈ ముగ్గురు స్టార్‌లు అభిమానుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించారు.

చాలా సంవత్సరాల క్రితం  కమల్ హాసన్ దర్శకత్వంలో రూపొందిన Hey Ram సినిమాలో షారుఖ్ ఖాన్ ఒక కీలక పాత్రలో కనిపించాడు. అయితే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే… ఆ సినిమాలో నటించడానికి షారుఖ్ ఖాన్ ఒక్క రూపాయి కూడా పారితోషికం తీసుకోలేదని అప్పట్లో చాలా వార్తలు వచ్చాయి. కమల్ హాసన్‌పై ఉన్న గౌరవం, అభిమానంతోనే ఆయన ఆ పాత్రను చేసినట్లు చెప్పుకుంటారు. ఆ సినిమా కమర్షియల్‌గా పెద్ద విజయం సాధించకపోయినా, కథా విషయంగా మాత్రం చాలా ప్రత్యేకంగా నిలిచింది.

అదే విధంగా తరువాత షారుఖ్ ఖాన్ నిర్మించి, నటించిన Ra.One సినిమాలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ అతిథి పాత్రలో కనిపించాడు. సినిమాలో ఒక చిన్న సీన్‌లోనే కనిపించినప్పటికీ, రజనీకాంత్ ఎంట్రీ ప్రేక్షకులకు మంచి సర్‌ప్రైజ్ ఇచ్చింది. ఆ సమయంలో అభిమానులు కూడా ఈ స్టార్‌ల మధ్య ఉన్న స్పెషల్ బాండ్ ని చూసి ఎంతో ఆనందించారు. ఇప్పుడు మరోసారి అలాంటి ఆసక్తికర ఇన్సిడెంట్ జరుగుతోందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇటీవల నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా వచ్చిన జైలర్  భారీ విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఆ సినిమాలో శివ రాజ్ కుమార్, మోహన్ లాల్, జాకీ ష్రాఫ్ వంటి పలువురు స్టార్‌లు అతిథి పాత్రల్లో కనిపించి సినిమాకు మరింత క్రేజ్ తీసుకొచ్చారు. ముఖ్యంగా శివరాజ్‌కుమార్ పోషించిన నరసింహ పాత్ర ప్రేక్షకులలో చాలా పాపులర్ అయింది. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్‌గా జైలర్ 2 రూపొందుతోంది. ఈసారి ఈ సినిమాలో షారుఖ్ ఖాన్ కూడా అతిథి పాత్రలో కనిపించనున్నాడని సోషల్ మీడియాలో బలంగా ప్రచారం జరుగుతోంది. దాదాపు 15 సంవత్సరాల తర్వాత రజనీకాంత్‌తో కలిసి ఒకే సినిమాలో కనిపించడం ద్వారా షారుఖ్ ఖాన్ ఆ అప్పటి స్నేహానికి మరోసారి గుర్తు చేయబోతున్నాడని అభిమానులు మాట్లాడుకుంటున్నారు.

ఈ వార్తకు మరింత బలం చేకూర్చిన విషయం ఏమిటంటే… మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ వ్యక్తిగత స్టైలిస్ట్ అయిన జీషాద్ షంషుద్దీన్  తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఒక ఆసక్తికరమైన పోస్ట్ పెట్టడం. ఆ పోస్టులో షారుఖ్ ఖాన్ కారు నడుపుతుండగా, పక్కన మోహన్‌లాల్ కూర్చుని, వెనుక సీట్లో రజనీకాంత్ శివరాజ్‌కుమార్ కూర్చున్నట్లు కనిపించే ఒక AI ఫోటోను షేర్ చేశారు. దానికి “ఇది ఖచ్చితంగా జరుగుతుంది” అనే క్యాప్షన్ కూడా జత చేశారు. దీంతో సినీ ప్రేమికుల్లో మరింత ఆసక్తి పెరిగింది. ఇక గత సంవత్సరం డిసెంబర్‌లో ప్రముఖ నటుడు మిథున్ చక్రవర్తి  కూడా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘జైలర్ 2’లో తాను విలన్ పాత్రలో కనిపించనున్నానని చెప్పారు. అలాగే ఆ సినిమాలో రజనీకాంత్, మోహన్‌లాల్, షారుఖ్ ఖాన్, శివరాజ్‌కుమార్, రమ్యకృష్ణన్  లతో కలిసి ఫైట్ సీన్స్ కూడా ఉంటాయని ఆయన చెప్పడంతో అప్పట్లో ఈ వార్త మరింత వైరల్ అయింది. ఇక రజనీకాంత్ సినిమాల్లో ఇతర ఇండస్ట్రీ స్టార్‌లు అతిథి పాత్రల్లో కనిపించడం కొత్త విషయం కాదు. మొత్తానికి జైలర్ 2లో కూడా స్టార్‌ లు మరోసారి కనిపించబోతుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా శివరాజ్‌కుమార్ పోషించిన నరసింహ పాత్ర మొదటి భాగంలో ఎంత పవర్‌ఫుల్‌గా కనిపించిందో, ఈసారి సీక్వెల్‌లో కూడా అంతే బలంగా ఉండబోతుందని సమాచారం. అదే సమయంలో షారుఖ్ ఖాన్ అతిథి పాత్ర నిజంగా ఉంటే మాత్రం ఈ సినిమా క్రేజ్ మరింత పెరగడం ఖాయం అని అభిమానులు భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *