మనల్ని ఎవడ్రా ఆపేది…ముందుగా వచ్చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్!

Spread the love

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్  ఒకవైపు రాజకీయ బాధ్యతలు నిర్వర్తిస్తూనే, మరోవైపు తాను ముందే కమిట్ అయిన సినిమాలను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నారు. రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నా, అభిమానుల కోసం సినిమాలను పూర్తి చేయడం ఆయన ప్రత్యేకతగా చెప్పుకోవాలి. లాస్ట్ ఇయర్ ఇప్పటికే వరుసగా రెండు చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అందులో ‘హరిహర వీరమల్లు’ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయినా, OG మాత్రం భారీ హిట్‌గా నిలిచి అభిమానులకు పండుగ చేసుకునేలా చేసింది. నిజానికి పవన్ కళ్యాణ్ సినిమాలకు హిట్, ఫ్లాప్‌లతో సంబంధం లేదనడంలో అతిశయోక్తి లేదు. ఆయన స్క్రీన్‌పై కనిపిస్తే చాలు, థియేటర్లలో ప్రత్యేకమైన ఉత్సాహం కనిపిస్తుంది. ఇప్పుడు ఆయన చేస్తున్న మరో భారీ ప్రాజెక్ట్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’.  ఈ చిత్రాన్ని స్టార్ డైరెక్టర్హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్నారు. పవన్ సరసన ఈ చిత్రంలో యంగ్ హీరోయిన్లుగా  శ్రీలీల, రాశి ఖన్నాలు  నటిస్తున్నారు. పాటలకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇక థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కోసం వర్క్ చేస్తున్నట్లు మూవీ టీమ్ తెలిపింది. ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. గతంలో హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టిన సంగతి తెలిసిందే. ఆ సినిమా తర్వాత పవన్-హరీష్ కాంబో మళ్లీ వస్తుండటంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ముఖ్యంగా గబ్బర్ సింగ్ తరహాలోనే ఈసారి కూడా పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో పవన్ కనిపించబోతుండటం సినిమాపై హైప్ మరింత పెంచుతోంది. ఐతే మొదట ఈ సినిమాను మార్చి 26న విడుదల చేయాలని ప్లాన్ చేశారు. అయితే మార్చి రేసులో ఉండాల్సిన కొన్ని భారీ చిత్రాలు వాయిదా పడటంతో బాక్సాఫీస్ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఈ నేపథ్యంలో ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాన్ని ఒక వారం ముందుకు జరిపి మార్చి 19న విడుదల చేస్తున్నట్లు టీమ్ అధికారికంగా తెలిపింది. ఈమేరకు ఒక పోస్టర్ ను విడుదల చేసింది. సో మన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఒక వారం ముందుగానే థియేటర్లలో సందడి చేయనున్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *