
Allu Arjun & Shahrukh Khan: బాలీవుడ్ స్టార్ షారుఖ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. వీరిద్దరికి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. వైవిధ్యమైన కథలను ఎంచుకుని బ్లాక్ బస్టర్స్ సాధిస్తూ కెరీర్ లో దూసుకెళుతున్నారు. అయితే.. ఈ ఇద్దరితో ఓ బడా నిర్మాణ సంస్థ సినిమాలు నిర్మించేందుకు ప్లాన్ చేస్తుందనే వార్త బయటకు వచ్చింది. ఈ వార్త లీకైనప్పటి నుంచి ఈ ప్రాజెక్టుల పై మరింత ఆసక్తి ఏర్పడింది. ఇంతకీ.. ఆ బడా నిర్మాణ సంస్థ ఏంటి..? ఈ క్రేజీ మూవీ పట్టాలెక్కేది ఎప్పుడు..?
షారుఖ్ ఖాన్ ఆమధ్య కెరీర్ లో వెనబడినప్పటికీ పఠాన్, జవాన్ సినిమాలతో వరుసగా సక్సెస్ సాధించి ఫామ్ లోకి వచ్చాడు. ఆతర్వాత నటించిన డంకీ మూవీ మాత్రం అంచనాలను అందుకోలేకపోయింది. ప్రస్తుతం చేస్తోన్న మూవీ షూటింగ్ లో చేతికి గాయాలు అవ్వడంతో షూటింగ్ కి బ్రేక్ ఇచ్చాడు. అయితే.. ఇప్పుడు షారుఖ్ తో సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తోన్న నిర్మాణ సంస్థ హోంబేళే. ఈ నిర్మాణ సంస్ధ పాన్ ఇండియా రేంజ్ లో భారీ చిత్రాలు నిర్మిస్తుంది. ప్రభాస్ తో సలార్ మూవీని తెరకెక్కించింది. సలార్ 2 నిర్మించాల్సివుంది. అలాగే సలార్ 2 కాకుండా ప్రభాస్ తో మరో సినిమా ప్లాన్ చేస్తుంది. ఇప్పుడు షారుఖ్ తో మూవీని నిర్మించనుంది.
షారుఖ్ తో పాటు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో కూడా ఓ భారీ చిత్రం చేయాలి అనుకుంటుందట. అల్లు అర్జున్ ఇప్పుడు అట్లీతో భారీ క్రేజీ పాన్ వరల్డ్ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమాని కోలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ నిర్మిస్తుంది. ఇందులో బన్నీకి జంటగా బాలీవుడ్ బ్యూటీ దీపికా పడుకునే నటిస్తుంది. హాలీవుడ్ టెక్నీషియన్స్ తో ఈ సినిమాని రూపొందిస్తున్నారు. ప్రస్తుతం బన్నీ ఈ మూవీ షూటింగ్ బిజీలో ఉన్నారు. ఎక్కువుగా ముంబాయిలో ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. త్వరలో హైదరాబాద్, చెన్నైలో కూడా షూటింగ్ చేయనున్నారు. Allu Arjun & Shahrukh Khan.
అట్లీతో సినిమా తర్వాత బన్నీ సినిమా ఎవరితో అనేది కన్ ఫర్మ్ కాలేదు. అందుచేత హాంబళే బ్యానర్ లో బన్నీ సినిమా వెంటనే ఉండచ్చనే ప్రచారం జరుగుతుంది. షారుఖ్ ఖాన్, అల్లు అర్జున్.. ఈ ఇద్దరితో చేసే సినిమాలకు డైరెక్టర్ ఎవరంటే.. సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ పేరు వినిపిస్తోంది. ప్రస్తుతం ప్రశాంత్ నీల్.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ టైటిల్ డ్రాగన్. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో ఈ మూవీ రూపొందుతోంది. ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ సలార్ 2 చేయాల్సివుంది. అందుచేత హాంబేళి సంస్థ షారుఖ్ తో మూవీ, బన్నీతో మూవీ కన్ ఫర్మ్ చేసినా.. పట్టాలెక్కడానికి టైమ్ పడుతుంది. అయితే.. షారుఖ్, బన్నీలతో వేరు వేరుగా సినిమాలు చేస్తాదా..? లేక వీరిద్దిరి కాంబోలో మల్టీస్టారర్ ప్లాన్ చేస్తుందా అనేది కూడా తెలియాల్సివుంది. మరి.. త్వరలో ఈ క్రేజీ ప్రాజెక్టులను అనౌన్స్ చేస్తారేమో చూడాలి.