
Akhanda 2 and OG: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఇటీవల హరి హర వీరమల్లు అంటూ ప్రేక్షకుల ముందుకు రావడం.. ఆ సినిమా ప్రేక్షకులను అలరించడం తెలిసిందే. అయితే.. వీఎఫ్ఎక్స్ వర్క్ మరింత క్వాలిటీగా ఉండుంటే ఆశించిన స్థాయిలో బ్లాక్ బస్టర్ అయ్యుండేది అనే టాక్ వుంది. ఈసారి రానున్న ఓజీ మూవీతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సాధించడం ఖాయమనే మాటలు బలంగా వినిపిస్తున్నాయి. అయితే.. పవర్ స్టార్ కోసం రిలీజ్ డేట్స్ ప్లాన్ మార్చారని ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఇంతకీ.. ఏం జరిగింది..?
సంక్రాంతి అయినా.. సమ్మర్ అయినా.. దసరా అయినా.. ఒక పెద్ద సినిమా వస్తుందంటే.. కొంత గ్యాప్ ఇచ్చి తర్వాత మరో పెద్ద సినిమాను రిలీజ్ చేసేవారు. ఒక తేదీన రెండు భారీ చిత్రాలు రిలీజ్ కావడం అనేది చాలా అరుదు. అలా చేస్తే.. రెండు సినిమాల నిర్మాతలకు ఇబ్బందే. అయితే.. సెప్టెంబర్ 25న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ రిలీజ్ కానున్నట్టుగా అనౌన్స్ చేశారు. ఆతర్వాత అదే డేట్ కి నట సింహం బాలకృష్ణ అఖండ 2 రిలీజ్ అని కూడా ప్రకటించారు. దీంతో బాలయ్య అఖండ 2, పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాలు ఒకే రోజున బాక్సాఫీస్ దగ్గర పోటీపడనున్నాయి అనేది అటు అభిమానుల్లోనూ, ఇటు ఇండస్ట్రీలోనూ హాట్ టాపిక్ అయ్యింది.
అయితే.. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే.. సెప్టెంబర్ 25న పవర్ స్టార్ ఓజీ రిలీజ్ అవుతుందట కానీ.. బాలయ్య అఖండ 2 మాత్రం డిసెంబర్ కి పోస్ట్ పోన్ చేశారనేది ఇండస్ట్రీ ఇన్ సైడ్ న్యూస్. కారణం ఏంటంటే.. రెండు సినిమాలు ఒకే రోజున విడుదల అయితే రెండు సినిమాలకు ఇబ్బందే. అందుకనే నిర్మాతలు మాట్లాడుకుని ఈ నిర్ణయం తీసుకున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే.. డిసెంబర్ 5న ప్రభాస్ ది రాజాసాబ్ ఉంది. ఆ సినిమా డేట్ కే అఖండ 2 రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారట. రాజాసాబ్ మూవీని సంక్రాంతికి షిఫ్ట్ చేశారట. Akhanda 2 and OG.
ఇక సంక్రాంతికి రావాల్సిన మెగా 157 మూవీని సమ్మర్ కి షిప్ట్ చేశారనే టాక్ వినిపిస్తుంది. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో చిరంజీవి నటిస్తున్న మూవీ ఇది. ఈ సినిమాని ఫస్ట్ నుంచి సంక్రాంతికి రిలీజ్ చేయాలి అనుకుంటున్నారు. అయితే.. విశ్వంభర ఎప్పుడో రావాల్సిన సినిమా ఇంత వరకు విడుదల కాలేదు. ఈ సినిమాని దీపావళికి విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారట. త్వరలోనే అఫిసియల్ గా అనౌన్స్ చేస్తారు. అయితే.. దీపావళికి విశ్వంభర రిలీజ్ చేసి మళ్లీ సంక్రాంతికి చిరంజీవి మూవీని రిలీజ్ చేస్తే ఇబ్బంది అవుతుందని.. ఇంకొంచెం గ్యాప్ ఎక్కువ ఉంటే బాగుంటుదనే ఈ నిర్ణయం తీసుకున్నారని టాక్. మరి.. ప్రచారంలో ఉన్న ఈ రిలీజ్ డేట్స్ పై త్వరలో క్లారిటీ ఇస్తారేమో చూడాలి.
Also Read: https://mega9tv.com/cinema/allu-arjun-and-shah-rukh-khan-movie-under-hombale-films/