మెగా మూవీకి మెగా డీల్ సెట్ అయ్యిందా..?

Spread the love

Megastar and Anil ravapudi’s movie: మెగాస్టార్ చిరంజీవి.. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా నుంచి అప్ డేట్స్ ఎప్పుడెప్పుడు వస్తాయా అని మెగా అభిమానులు వెయిట్ చేస్తున్నారు. అయితే.. ఈ మూవీ ఓటీటీ డీల్ గురించి సరికొత్త వార్త బయటకు వచ్చింది. ఈ సినిమాకి మెగా డీల్ సెట్ అయ్యిందని.. రిలీజ్ కు ముందు ఈ స్థాయిలో డీల్ సెట్ అవ్వడం గ్రేట్ అంటూ వార్తలు వస్తున్నాయి. ఇంతకీ.. ఈ క్రేజీ మూవీ ఓటీటీకి సెట్ అయిన మెగా డీల్ ఏంటి..?

ఇప్పుడు ట్రెండ్ మారింది. సినిమాలో ఎంత పెద్ద స్టార్ హీరో ఉన్నప్పటికీ.. ఓటీటీ డీల్ క్లోజ్ అవ్వడం అనేది చాలా కష్టమౌతుంది. సినిమా చూస్తే తప్పా ఏ ఓటీటీ సంస్థ కొనడం లేదు. రిలీజ్ ముందు వరకు బేరాలు జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మెగాస్టార్ మూవీ హాట్ కేక్ లా మారింది. చిరు, అనిల్ కాంబోలో రూపొందుతోన్న ఈ సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా నుంచి టీజర్ బయటకు రాలేదు.. కనీసం ఫస్ట్ లుక్ కూడా రాలేదు. అయినప్పటికీ ఈ మూవీకి అమేజాన్ సంస్థ 55 కోట్లు వరకు వచ్చిందట. కాస్త అటూ ఇటూగా 60 కోట్లకు డీల్ సెట్టయ్యే ఛాన్స్ ఉందని సమాచారం.

ఆగష్టు 22న మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు. ఈ సందర్భంగా ఈ మూవీ నుంచి టీజర్ రిలీజ్ చేస్తారని టాక్ వినిపిస్తోంది. అలాగే మంచి ముహూర్తం చూసి టైటిల్ కూడా అనౌన్స్ చేయాలి అనుకుంటున్నారు. ఈ టైటిల్ లో సంక్రాంతికి అనే సౌండింగ్ వినిపిస్తుంది అంటున్నారు. ఆమధ్య సంక్రాంతికి రఫ్పాడించేద్దాం అనే పేరు గట్టిగా వినిపించింది. ఇప్పుడు వినిపిస్తున్న టాక్ చూస్తుంటే.. ఈ టైటిల్ నే ఖరారు చేస్తారనే నమ్మకం కలుగుతోంది. అపజయం అనేది లేకుండా అనిల్ రావిపూడి వరుసగా సక్సెస్ సాధిస్తుండడంతో ఈ సినిమా కూడా షూర్ షాట్ గా బ్లాక్ బస్టర్ అవ్వడం గ్యారెంటీ అని ప్రచారం జరుగుతోంది. Megastar and Anil ravapudi’s movie.

ఇందులో వెంకీ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. ఆయన పాత్ర ఏంటి..? ఎంత సేపు కనిపిస్తాడు అనే విషయం గురించి ఎలాంటి అప్ డేట్ లేదు. అయితే.. వెంకీ ఈ సినిమా కోసం దాదాపు 20 రోజులు డేట్స్ ఇచ్చాడని తెలిసింది. దీనిని బట్టి ఇలా కనిపించి అలా వెళ్లిపోయే క్యారెక్టర్ కాదు. ముఖ్యమైన పాత్రే పోషిస్తున్నాడని తెలుస్తోంది. ఓ పాటలో కూడా వెంకీ కనిపిస్తారు. ప్ర‌స్తుతం హైద‌రాబాద్ లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రానికి భీమ్స్ సంగీతాన్ని అందిస్తున్నారు. ర‌మ‌ణ గోగుల‌తో ఇటీవ‌ల ఓ పాట పాడించారు. చిరు కూడా ఓ పాట పాడనున్నారని తెలిసింది. మొత్తానికి అనిల్ రావిపూడి బాగానే ప్లాన్ చేస్తున్నాడు. సంక్రాంతికి వస్తున్నాం సినిమా 300 కోట్లు కలెక్ట్ చేసి రీజనల్ మూవీస్ లో హయ్యస్ట్ కలెక్ట్ చేసిన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. మరి.. ఈ సినిమా ఎలాంటి రికార్డ్ సెట్ చేస్తుందో చూడాలి.

Also Read: https://mega9tv.com/cinema/veeramallu-vs-kingdom-both-movies-are-releasing-july-last-week/