వీరమల్లు వర్సెస్ కింగ్ డమ్..?

Spread the love

Veeramallu vs Kingdom: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వీరమల్లు మూవీ ఈ నెల 24న రిలీజ్ కాబోతోంది. ఎప్పుడో రావాల్సిన వీరమల్లు అన్ని అడ్డంకులను దాటుకుని రిలీజ్ కి రెడీ అయ్యింది. ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమా పై మరింత నమ్మకం పెరిగింది. పవన్ కళ్యాణ్‌ డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన నుంచి వస్తోన్న ఫస్ట్ మూవీ కావడంతో ఫ్యాన్స్ ధియేటర్స్ దగ్గర పండగ చేసేందుకు రెడీ అవుతున్నారు. అయితే.. ఈ సినిమా రిలీజైన వారం రోజుల్లోనే కింగ్ డమ్ సినిమా రాబోతోంది. దీంతో వీరమల్లుకు వారం రోజులు సరిపోతుందా..? వీరమల్లు వెర్సెస్ కింగ్ డమ్ అంటూ ప్రచారం జరుగుతోంది. మరి.. వీరమల్లుకు వారం సరిపోతుందా..?

పవర్ స్టార్ సినిమా పెద్ద సినిమా. స్టార్ సినిమా వస్తుందంటే.. కనీసం రెండు వారాలు గ్యాప్ ఉండాలి. అలా అయితే.. ఆ సినిమాకి మరింతగా కలెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. పాజిటివ్ టాక్ వస్తే.. ఫ్యామిలీ ఆడియన్స్ ధియేటర్స్ కు వస్తారు. అలా జరిగితే రెండు వారాలు ఈ సినిమా థియేటర్స్ లో ఉండే ఛాన్స్ ఉంటుంది. అయితే.. కింగ్ డమ్ వస్తే.. వీరమల్లుకు ఆ ఛాన్స్ ఉండకపోవచ్చు. ఒకప్పుడు అంటే వంద రోజులు ఆడేది. ఇప్పుడు మూడు రోజుల్లోనే కలెక్షన్స్ మొత్తం వచ్చేయాలని భారీగా రిలీజ్ చేస్తున్నారు. అయితే.. వీరమల్లుకు భారీ బడ్జెట్ అయ్యింది.. నిర్మాణం ఐదు సంవత్సరాలు పాటు జరగడంతో మరింత పెరిగింది. అందుకనే భారీగా రేట్లు చెబుతున్నారట. Veeramallu vs Kingdom.

మరి.. భారీ రేట్లకు కొన్న బయ్యర్లకు ఆ డబ్బులు తిరిగి రావాలంటే.. రెండు వారాలు అయినా టైమ్ ఉండాలి. మరో క్రేజీ మూవీ రిలీజ్ కాకుండా ఉంటే బాగుంటుంది. అలా కుదరకపోతే అంత పెద్ద బడ్జెట్ పెట్టి సినిమాను తీసుకోవడం రిస్క్ అని ఆలోచిస్తారు. అయితే.. నిర్మాత ఏఎం రత్నం ఒక రేటు అనుకుని ఆ రేటుకి అమ్మడానికి అంతా రెడీ చేసుకున్నారు. దాదాపు బిజినెస్ క్లోజింగ్ కు వచ్చింది. ఇలాంటి టైమ్ లో విజయ్ దేవరకొండ కింగ్ డమ్ సినిమాని జులై 31న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. అంతే.. ఇక అక్కడ నుంచి ఏం జరగనుందో అనే టెన్షన్ స్టార్ట్ అయ్యింది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ తో పోలీస్తే.. విజయ్ దేవరకొండ ఖచ్చితంగా చిన్న హీరోనే. కాకపోతే కింగ్ డమ్ మూవీకి క్రేజ్ ఏర్పడింది. చాలా సార్లు వాయిదాపడిన కింగ్ డమ్ మూవీని ఈసారి పక్కాగా రిలీజ్ చేస్తున్నామని.. జులై 31న కింగ్ డమ్ వస్తుందని మేకర్స్ అనౌన్స్ చేశారు. లేటెస్ట్ గా రిలీజ్ చేసిన ప్రొమోతో మరింత ఆసక్తి ఏర్పడింది. ప్రకటించినట్టుగా కింగ్ డమ్ జులై 31న వస్తే.. వీరమల్లు కలెక్షన్స్ పై ప్రభావం చూపించవచ్చు. పవన్ సినిమాకి యావరేజ్ టాక్ వస్తే.. కలెక్షన్స్ ఓ రేంజ్ లో ఉంటాయి. అదే బ్లాక్ బస్టర్ టాక్ వస్తే.. కలెక్షన్స్ సునామీనే. మరి.. వీరమల్లుకు ఎలాంటి టాక్ వస్తుందో.? కింగ్ డమ్ నిజంగానే జులై 31న వస్తుందో లేదో.. అసలు ఏం ఏం జరుగనుందో చూడాలి.

Also Read: https://mega9tv.com/cinema/nagarjuna-and-vekatesh-multistarrer-but-it-remains-to-be-seen-when-this-crazy-combo-will-set/