నటుడు శివాజీ – అనసూయ మధ్య సాగుతున్న ‘దండోరా’ వివాదం మరో మలుపు తిరిగింది.శివాజీ వ్యాఖ్యలను తప్పుబట్టిన అనసూయపై నెటిజన్లు పాత వీడియోలను వైరల్ చేయడంతో ఈ గొడవలోకి సీనియర్ నటి రాశి ఎంట్రీ ఇచ్చారు.గతంలో ఒక కామెడీ షోలో అనసూయ తనను ఉద్దేశించి ‘రాశి గారి ఫలాలు’ అంటూ డబుల్ మీనింగ్ డైలాగ్స్ వాడారని, ఒక మహిళ అయ్యుండి తోటి మహిళను బాడీ షేమింగ్ చేయడం తప్పని రాశి మండిపడ్డారు.దీనిపై స్పందించిన అనసూయ, సోషల్ మీడియా వేదికగా రాశికి బహిరంగ క్షమాపణలు చెప్పారు.ఆ సమయంలో స్క్రిప్ట్ డిమాండ్ మేరకు, భాషపై పూర్తి అవగాహన లేక ఆ మాటలు అన్నానని, ఎవరినీ నొప్పించాలనే ఉద్దేశం తనకు లేదని వివరణ ఇచ్చారు.రాశి వంటి సీనియర్ నటిని గౌరవిస్తానని,తన మాటలు ఆమెను బాధించి ఉంటే బేషరతుగా క్షమాపణలు కోరుతున్నానని అనసూయ ఒక ఎమోషనల్ నోట్ విడుదల చేశారు.
