ఉద్యోగుల వ‌యోప‌రిమితి పెంపుపై కేబినెట్ స‌బ్ క‌మిటీ స‌మావేశం

Spread the love

ప్ర‌భుత్వ రంగ సంస్థ‌ల్లో ప‌నిచేసే ఉద్యోగుల వ‌యోప‌రిమితి పెంపుపై కేబినెట్ స‌బ్ క‌మిటీ స‌మావేశ‌మైంది. ఆన్ లైన్ లో జ‌రిగిన స‌మావేశానికి మంత్రులు నారాయ‌ణ‌,కేశ‌వ్,అధికారులు హాజ‌రయ్యారు. అమ‌రావ‌తి క్యాంపు కార్యాల‌యం నుంచి జూమ్ ద్వారా మంత్రి నారాయ‌ణ‌ హాజ‌రయ్యారు. ప్ర‌భుత్వ రంగ సంస్థ‌లు,కార్పొరేష‌న్ లు,9,10 షెడ్యూల్ సంస్థ‌ల ఉద్యోగుల‌కు రిటైర్మెంట్ ఏజ్ పెంపుపై చ‌ర్చించారు. కోర్టు ఆదేశాల‌తో 62 ఏళ్ల వ‌యోప‌రిమితి తో 2831 మంది ఉద్యోగులు కొన‌సాగుతున్నారు. వయోప‌రిమితి పెంపుతో ప్ర‌భుత్వంపై పడే ఆర్ధిక భారంపై స‌బ్ క‌మిటీ స‌భ్యులు చ‌ర్చించారు. కార్పొరేష‌న్ ల వారీగా ఉద్యోగులు,ఆర్ధిక భారం వివ‌రాల‌తో మ‌రోసారి స‌మావేశం కావాల‌ని స‌బ్ క‌మిటీ నిర్ణ‌యించింది.