
Anushka vs Rashmika: అనుష్క నటించిన లేటెస్ట్ మూవీ ఘాటి. ఈ మూవీకి క్రిష్ డైరెక్టర్. వేదం తర్వాత అనుష్క, క్రిష్ కలిసి చేసిన సినిమా ఇది. ఇది కొన్ని యధార్థ సంఘటనలు ఆధారంగా రూపొందిన సినిమా. చాలా గ్యాప్ తర్వాత క్రిష్ నుంచి వస్తోన్న సినిమా కావడంతో ఘాటి సినిమా పై అంచనాలు ఉన్నాయి. అయితే.. ఈ సినిమాను సెప్టెంబర్ 5న రిలీజ్ చేయడానికి డేట్ ఫిక్స్ చేశారు. ఈ సందర్భంగా ట్రైలర్ రిలీజ్ చేశారు. మరి.. ట్రైలర్ ఎలా ఉంది..? రష్మికతో పోటీ ఏంటి..? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
ఘాటి.. ట్రైలర్ లో అనుష్కను కొత్తగా చూపించారు క్రిష్. ఇంత వరకు అనుష్క చేయని పాత్ర అని చెప్పచ్చు. ఇందులో ఓ మామూలు అమ్మాయి నుంచి క్రిమినల్ గా ఎలా మారింది..? ఆతర్వాత లెజెండ్ ఎలా అయ్యింది…? అనేది చూపించబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇందులో మంచి ప్రేమకథను కూడా మిక్స్ చేశారు. విక్రమ్ ప్రభు, అనుష్క మధ్య జరిగే ప్రేమకథ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఎంటర్ టైన్మెంట్ మాత్రమే కాదు.. ఎమోషనల్ కంటెంట్ కూడా బాగానే ఉంది. అంతకు మించి వాట్ నెక్ట్స్ అనేలా క్యూరియాసిటీతో చూసేలా ఈ కథను క్రిష్ తెరకెక్కించినట్టుగా తెలుస్తుంది.
ఒకప్పుడు లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేయాలంటే అనుష్కనే చేయాలి. ఇంకా చెప్పాలంటే.. లేడీ ఓరియంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అనుష్క అనే పేరు తెచ్చుకున్నారు. అరుంథతి, రుద్రమదేవి, భాగమతి, నిశ్శబ్ధం.. ఇలా వైవిధ్యమైన పాత్రలతో మెప్పించిన అనుష్క నుంచి వస్తోన్న మరో లేడీ ఓరియంటెడ్ మూవీగా ఈ సినిమా సంచలనం సృష్టించడం ఖాయం అనే ఫీలింగ్ ను ట్రైలర్ తో కలిగించారు. ఈవిధంగా ట్రైలర్ తో క్రిష్ సక్సెస్ సాధించాడని చెప్పచ్చు. దీంతో ఈ సినిమా పై ఆడియన్స్ లో మరింత ఆసక్తి ఏర్పడింది. Anushka vs Rashmika.
ఇక రష్మికతో పోటీ విషయానికి వస్తే.. రష్మిక నటించిన మూవీ ది గర్ల్ ఫ్రెండ్. దీనికి రాహుల్ రవీంద్రన్ డైరెక్టర్. జీఏ 2 పిక్చర్స్ సంస్థ ఈ సినిమాని నిర్మించింది. ఈ సినిమాని సెప్టెంబర్ 5న రిలీజ్ చేస్తున్నారు. అలాగే అదే డేట్ కు శివ కార్తికేయన్ మదరాసి సినిమా కూడా రానుంది. అలాగే తేజ సజ్జ మిరాయ్ కూడా సెప్టెంబర్ 5న రాబోతుంది. ఇలా సెప్టెంబర్ 5న గట్టి పోటీనే ఉంది. ఈ పోటీ ప్రధానం అనుష్క ఘాటి, రష్మిక ది గర్ల్ ఫ్రెండ్ మధ్య ఉంటుందని టాక్ వినిపిస్తోంది. మొత్తానికి పోటీకి అనుష్క సై అంది. మరి.. ఈ పోటీలో ఘాటి విజేతగా నిలుస్తుందో ఇంకెవరైనా విజేతగా నిలుస్తారో చూడాలి.
Also Read: https://mega9tv.com/cinema/rajinikanths-jailer-2-under-mythri-movie-makers/