
Rajinikanth’s Jailer 2: కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ కూలీ మూవీతో.. భారీ అంచనాలతో వస్తున్న విషయం తెలిసిందే. ఆయన నెక్ట్స్ సినిమాల విషయంలో మరింతగా స్పీడు పెంచుతున్నారే కానీ.. స్పీడు ఏమాత్రం తగ్గించడం లేదు. అయితే.. రజినీ నెక్ట్స్ ఓ ప్లాప్ డైరెక్టర్ తో సినిమా చేయబోతున్నారనే వార్త ప్రచారంలోకి వచ్చింది. ఇంతకీ.. ఆ ప్లాప్ డైరెక్టర్ ఎవరు..? నిజంగానే ఈ ప్రాజెక్ట్ ఫిక్స్ అయ్యిందా…?
కూలీ సినిమా తర్వాత రజినీకాంత్ జైలర్ 2 చేయనున్నారు. ఆమధ్య వరుసగా ఫ్లాపుల్లో ఉన్న రజినీకి సక్సెస్ అందించిన సినిమా జైలర్. నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన జైలర్ మూవీ బ్లాక్ బస్టర్ సక్సెస్ అందించడంతో ఈ సినిమాకి సీక్వెల్ తీయాలని ఫిక్స్ అయ్యారు. అదే.. జైలర్ 2. ఈ సినిమాను అంచనాలకు తగ్గట్టుగా భారీ స్థాయిలో అన్నివర్గాల ప్రేక్షకులను అలరించేలా ప్లాన్ చేస్తున్నారు. ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే.. ఇందులో నట సింహం బాలయ్య నటించబోతున్నారు. ఇదే ఓ విశేషం అనుకుంటే.. అంతకు మించి అనేట్టుగా ఇందులో కింగ్ నాగార్జున కూడా నటించబోతున్నారని ప్రచారం జరుగుతుంది.
ఇక జైలర్ 2 తర్వాత రజినీ సినిమా ఎవరితో అంటే.. ఊహించని విధంగా తెలుగు డైరెక్టర్ వివేక్ ఆత్రేయ పేరు వినిపించింది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ రజినీకాంత్ తో ఎప్పటి నుంచో ఓ సినిమా చేయాలని ట్రై చేస్తుంది. రజినీకి సరిపడే కథను రెడీ చేయమని కొంత మంది దర్శకులకు చెప్పడం జరిగిందని.. వివేక్ ఆత్రేయ ఆ పనిలోనే ఉన్నాడని వార్తలు వస్తున్నాయి. వివేక్ ఆత్రేయ నానితో సరిపోదా శనివారం తర్వాత మరో సినిమా చేయలేదు. ప్రస్తుతం రజినీ కోసం కథ రాసే పనిలోనే ఉన్నాడని టాక్. ఈ వార్త లీకైనప్పుడు ఇదేదో గాసిప్ అనుకున్నారు కానీ.. నిజంగానే వివేక్ రజినీ కోసం స్టోరీ రెడీ చేస్తున్నాడని తెలిసింది. Rajinikanth’s Jailer 2.
ఇక అసలు విషయానికి వస్తే.. రజినీకాంత్ తో సినిమా చేయడం కోసం డైరెక్టర్ శివ కథ రెడీ చేసాడట. ఇటీవల కంగువ అనే సినిమాను శివ తెరకెక్కించడం.. ఆ సినిమా డిజాస్టర్ అవ్వడం తెలిసిందే. అయితే.. రజినీతో శివ సినిమా ఫిక్స్ అవుతుందా…? ఫామ్ లో లేని శివతో సినిమా చేయడానికి రజినీ ఒప్పుకుంటారా…? అనేది ఆసక్తిగా మారింది. అయితే.. రజినీతో సినిమా చేయడం కోసం ఓ వైపు మైత్రీ మూవీ మేకర్స్.. మరో వైపు నిర్మాత శ్రీనివాస్ చిట్టూరి కూడా ట్రై చేస్తున్నారని తెలిసింది. మరి.. రజినీ ఏ నిర్మాతకు ఓకే చెబుతారో చూడాలి.