పుష్ప-1, పుష్ప-2 చిత్రాలతో భారతీయ సినిమాలలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్న నటుడు అల్లు అర్జున్. ఈ సినిమాతో జాతీయ అవార్డును గెలుచుకుని ఆ ఘనత అందుకున్న మొదటి తెలుగు నటుడిగా నిలిచాడు. ఇక నేడు ఆయన పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన నటిస్తున్న కొత్త చిత్రం నుండి టైటిల్ పోస్టర్ ను మూవీ టీమ్ విడుదల చేసింది. అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ ఇందులో నటిస్తున్నారు. కళానిధి మారన్ సమర్పణలో సన్ పిక్చర్స్ నిర్మాణ సంస్థ భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. దీపికా పదుకునే హీరోయిన్ గా నటిస్తోంది. ఇక తాజాగా విడుదల చేసిన పోస్టర్ లో అల్లు అర్జున్ చాలా వైవిధ్యంగా కనిపిస్తున్నారు. ‘రాకా’ అనే టైటిల్ ను ఈ సినిమాకు ఖరారు చేశారు. ఇది అల్లు అర్జున్ కు 22వ సినిమా కాగా, అట్లీకి 6వ సినిమా. భారతీయ సినిమా రోజు రోజుకు నిర్మాణ విలువల పరంగా మరింత ముందుకు దూసుకెళ్తున్న తరుణంలో ఏ రేంజ్ లో ఈ సినిమా తెరకెక్కనుందో అనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. ఇక ఈ సినిమా సాంకేతికంగా అత్యద్భుతమైన కథాకథనాలతో రూపొందనున్నట్లు తెలుస్తోంది. ఈ పోస్టర్ కు సోషల్ మీడియాలో భారీ స్పందన కనిపిస్తోంది.