మరో ఫ్రెష్ కాంబినేషన్ తో మళ్లీ సంక్రాంతికి..!  

Spread the love

ప్రస్తుతం వేగంగా సినిమాలు చేస్తూ అవి కూడా అన్నీ విజయవంతమైన వినోదాత్మక సినిమాలతో దూసుకుపోతున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ లో ఈయనకు ప్రత్యేక క్రేజ్ ఉంది. కథలో సరదా సన్నివేశాలు, భావోద్వేగాలు, మాస్ ఎలిమెంట్స్ అన్ని సమతుల్యంగా ఉండేలా చేసి ప్రేక్షకులను అలరించడం ఆయన ప్రత్యేకత. ఇక ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి తెరకెక్కించిన ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమా విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులు ఈ చిత్రాన్ని విపరీతంగా ఆదరించారు. ఆ సినిమా కలెక్షన్లు చూస్తే ట్రేడ్ వర్గాలకే ఆశ్చర్యం కలిగింది. మొత్తంగా ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 350 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఒక రీజనల్ సినిమా ఇంత పెద్ద స్థాయిలో వసూళ్లు సాధించడం నిజంగా గొప్ప విషయం. ఈ విజయంతో అనిల్ రావిపూడి మరోసారి తన సత్తా చూపాడు. ఇప్పుడు ఈ భారీ విజయానంతరం ఆయన తదుపరి ప్రాజెక్ట్‌పై సినీ వర్గాల్లో భారీ చర్చ జరుగుతోంది. ఈసారి కూడా ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతి ఇవ్వాలని అనిల్ ప్లాన్ చేస్తున్నాడు. ముఖ్యంగా ఈసారి ఆయన ఒక భారీ మల్టీస్టారర్ సినిమాను రూపొందించేందుకు సిద్ధమవుతున్నారు.  ఈ సినిమాలో టాలీవుడ్ సీనియర్ స్టార్ విక్టరీ వెంకటేష్, నందమూరి హీరో కళ్యాణ్ రామ్ లు కలిసి నటించబోతున్నారనే విషయం తెలిసిందే. ఇది వెంకటేష్ తో అనిల్ చేస్తున్న 5వ మూవీ కాగా, కళ్యాణ్ రామ్ తో రెండవది. తనకు మొదటి సినిమా అవకాశం ఇచ్చిన కళ్యాణ్ రామ్ ఎక్కువ సినిమాలు చేసిన విక్టరీ వెంకటేష్ లతో వచ్చే సంక్రాంతికి సందడి చేసేందుకు రెడీ అవుతున్నాడు. షైన్ స్క్రీన్స్ పతాకంపై మూడోసారి సాహూ గారపాటి నిర్మాణంలో అనిల్ ఈ మూవీ చేస్తున్నాడు. జీ స్టూడియోస్ కూడా భాగం కానుంది. అలాగే సురేష్ ప్రొడక్షన్స్ సమర్పిస్తోంది. ఇలా ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలున్నాయి. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *