బాలయ్య, వెంకీ కాంబో మూవీ ఫిక్స్!

Spread the love

Balakrishna and victory venkatesh: విక్టరీ వెంకటేష్‌.. సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సాధించి సెన్సేషన్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత వెంకీ ఆలోచనలో మార్పు వచ్చింది. తన నుంచి ఆడియన్స్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ ఎక్స్ పెక్ట్ చేస్తున్నారని తెలుసుకుని.. ఆతరహా సినిమాలే చేయాలని ఫిక్స్ అయ్యాడట. అలాగే వేరే హీరో సినిమాల్లో మంచి పాత్ర లభిస్తే చేయడానికి ఓకే చెబుతున్నాడు. తాజాగా బాలయ్య మూవీలో నటించేందుకు వెంకీ ఓకే చెప్పాడని తెలిసింది. ఇంతకీ.. బాలయ్య, వెంకీ కలిసి చేసే సినిమా ఏంటి..?

సంక్రాంతికి వస్తున్నాం తర్వాత వెంకీ.. మెగాస్టార్ చిరంజీవి సినిమాలో నటిస్తున్నాడు. ఈ క్రేజీ మూవీకి అనిల్ రావిపూడి డైరెక్టర్. ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నంచి చక చకా వర్క్ జరుగుతోంది. చిరు, వెంకీ పై వచ్చే సీన్స్ వేరే లెవల్లో ఉంటాయని.. ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తారని అనిల్ రావిపూడి ఇటీవల తెలియచేశారు. చిరు మూవీలో వెంకీ నటిస్తున్నారని తెలిసినప్పటి నుంచి ఈ సినిమా పై మరింత క్రేజ్ పెరిగింది. ఇందులో చిరుకు జంటగా అందాల తార నయనతార నటిస్తుంది. చిరు పుట్టినరోజుకు టైటిల్ లేదా గ్లింప్స్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. సంక్రాంతికి ఈ సినిమాని భారీ స్థాయిలో రిలీజ్ చేయనున్నారు. Balakrishna and victory venkatesh.

ఇక బాలయ్యతో వెంకీ సినిమా విషయానికి వస్తే.. బాలయ్య ప్రస్తుతం అఖండ 2 అనే సినిమా చేస్తున్నాడు. ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి తెరకెక్కిస్తోన్న ఈ సినిమాని పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేయనున్నారు. ఎవరు ఎన్ని అంచనాలతో థియేటర్ కు వచ్చినా అంతకు మించి అనేలా అఖండ 2 ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. సెప్టెంబర్ 25న అఖండ 2 మూవీ రిలీజ్ కానుంది. ఈ సినిమా తర్వాత బాలయ్య.. మలినేని గోపీచంద్ డైరెక్షన్ లో భారీ సినిమా చేయనున్నారు. బాలయ్యను కొత్తగా చూపించేలా పవర్ ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేశాడట మలినేని. త్వరలో ఈ మూవీ పట్టాలెక్కనుంది.

అయితే.. ఈ సినిమాలో ఓ క్యారెక్టర్ కోసం వెంకీని కాంటాక్ట్ చేస్తే.. చేయడానికి ఓకే చెప్పాడట. ఈ వార్త తెలిసినప్పటి నుంచి వెంకీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది..? బాలయ్య, వెంకీ మధ్య వచ్చే సీన్స్ ఎలా ఉండబోతున్నాయి…? అనేది ఆసక్తిగా మారింది. త్వరలోనే ఈ సినిమాలో వెంకీ నటిస్తున్నారు అనేది అఫిషియల్ గా అనౌన్స్ చేస్తారని తెలిసింది. ఓ వైపు చిరు మూవీలో నటిస్తూ.. మరో వైపు బాలయ్య మూవీలో నటించేందుకు వెంకీ ఓకే చెప్పడం విశేషం. అలాగే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో చేసే సినిమాని ఆగష్టు నుంచి పట్టాలెక్కించనున్నాడు. మొత్తానికి వెంకీ స్పీడు మామూలుగా లేదుగా..

Also Read: https://mega9tv.com/cinema/massive-arrangements-for-veeramallu-pre-release-events-in-tirupati-and-varanasi/