వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ అదిరిందిగా..!

Spread the love

Veeramallu pre-release events: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ నటించిన భారీ పీరియాడిక్ మూవీ హరి హర వీరమల్లు. క్రిష్‌, జ్యోతికృష్ణ తెరకెక్కించిన వీరమల్లు ఎట్టకేలకు ఈ నెల 24న థియేటర్స్ లోకి వచ్చేందుకు రెడీ అవుతోంది. ఇటీవల రిలీజ్ చేసిన వీరమల్లు ట్రైలర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో.. ప్రమోషన్స్ లో స్పీడు పెంచడానికి ప్లాన్ చేస్తున్నారు. ముఖ్యంగా వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని తెలిసింది. ఇంతకీ.. వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడు..? ఎక్కడ..? అసలు ప్లాన్ ఏంటి..?

వీరమల్లు ట్రైలర్ రిలీజ్ చేసిన తర్వాత అప్పటి వరకు సినిమా పై ఉన్న అనుమానాలు అన్నీ పోయాయి. ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్‌ ఇలాంటి పాత్రలో కనిపించకపోవడంతో.. అభిమానులకు ఈ ఒక్క ట్రైలర్ తోనే పూనకాలు వచ్చినట్టు అయ్యింది. ఇక ఫుల్ సినిమా చూస్తే ఇంకెలా ఫీలవుతారో.. అనేది ఆసక్తిగా మారింది. మతం కారణంగా హిందువుల పై జరిగే దాడులకు వ్యతిరేకంగా నిలబడే యోధుడు పాత్రలో పవన్ కళ్యాణ్ నటిస్తున్నారు. ఇందులో డైలాగ్స్, వార్ ఎపిసోడ్స్ ఆడియన్స్ ని విశేషంగా ఆకట్టుకునేలా.. ఇంకా చెప్పాలంటే.. థ్రిల్ కలిగించేలా డిజైన్ చేసారని తెలుస్తోంది. Veeramallu pre-release events.

ఇప్పటి వరకు వీరమల్లు ప్రమోషన్స్ లో పవన్ కళ్యాణ్‌ పాల్గొనలేదు. ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ ను భారీగా ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. ఇంతకీ ఈ క్రేజీ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ ఏంటంటే.. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను అతిథిగా ఆహ్వానించినట్లు టాక్ వినిపిస్తోంది. ఈ ఈవెంట్ ను జులై 17న వారణాసిలో ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఇక జులై 19న తిరుపతిలో నిర్వహించే మరో ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ముఖ్య అతిథిగా ఆహ్వానించారని వార్తలు వస్తున్నాయి.

ఈ రెండు ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ను భారీ బహిరంగ సభ తరహాలో ప్లాన్ చేస్తున్నారట. దీంతో ఇటు సౌత్, అటు నార్త్ లో ఈ వీరమల్లు సినిమాకి కావాల్సినంత బజ్ క్రియేట్ అవ్వడం ఖాయం. త్వరలో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కు సంబంధించి అఫిషియల్ అనౌన్స్ మెంట్ రానుందని తెలిసింది. లేట్ అయినా లేటెస్ట్ గా వచ్చినట్టుగా.. వీరమల్లు రావడం ఆలస్యం అయినా.. లేటెస్ట్ గా అంతా పక్కాగా ప్లాన్ చేసుకుని ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇది పవన్ కళ్యాణ్‌ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ కావడం విశేషం. దీనికి ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. మరి.. జులై 24న వచ్చే వీరమల్లు ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి విజయాన్ని సాధిస్తాడో చూడాలి.

Also Read: https://mega9tv.com/cinema/prabhas-vs-ranveer-singh-mega-clash-at-box-office-with-dhurandhar-and-rajasaad-on-december-5/