బిగ్ బాస్ -9 కంటస్టెంట్ తనూజ గౌడ రియల్ స్టోరీ..!

Spread the love

Tanuja Gowda Real Story: తెలుగులో బిగ్ బాస్ సీజన్ 9 సెప్టెంబర్ 7న ప్రారంభమైంది. ఈ సీజన్ లో కాస్త డిఫరెంట్ గా కామనర్స్ ని కూడా తీసుకున్నారు. ఇక సెలబ్రెటీల విషయానికి వస్తే.. ముద్ద మందారం సీరియల్ హిరోయిన్.. తనూజ పుట్టస్వామి కూడా వెళ్లారు. అయితే ఇన్నాళ్లు సీరియల్ లో పార్వతిగా అందరికి తెలుసు. కానీ రియల్ లైఫ్ లో తాను ఏలా ఉంటుందో చాలామందికి తెలియదు. ముఖ్యంగా ఆమె ఫ్యాన్స్ అయితే తనూజ బిగ్ బాస్ హౌస్ లో చూసి.. చాలా హ్యపీగా ఫీల్ అయ్యారు. తనూజ కూడా తన ఆటతో అదరగొడుతుంది. విన్నర్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని అంటున్నారు. ఈ సమయంలో ఆమె ఎలా ఇండస్ట్రీకి వచ్చారు..? ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఏంటి..? అనే విషయాలపై చర్చ స్టార్ట్ అయ్యింది. ఇవన్నీ కూడా తనూజ రియల్ స్టోరీలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

తనూజ గౌడ అసలు పేరు తనూజ పుట్టస్వామి. హిరోయిన్ కట్ అవుట్ కు ఏ మాత్రం తీసిపోని.. ఈ బ్యూటీ 1992 మార్చి 5న కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో జన్మించింది. ఈమెకు ఇద్దరు సిస్టర్స్. ఇంట్లో తనూజనే పెద్ద కూతురు. ఈమె స్కూలింగ్ అంత బెంగళూర్ లోనే సాగింది. బెంగళూరు యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తి చేసిన తనూజకు.. చిన్నప్పటి నుంచి నటనపై ఆసక్తి ఉండేది. కానీ తనూజ తండ్రి మాత్రం ఆమెను టీచర్ గా చూడాలని కోరుకున్నారట. అందుకు కారణం.. ఆయన మేనల్లుడు టీచర్ కావడంతో..తనూజను కూడా టీచర్ చేయ్యాలనే కోరిక ఉండేది. కానీ తనూజ మాత్రం నటనకే ప్రాధాన్యం ఇచ్చింది. కాలేజీ రోజుల్లోనే హిరోయిన్ గా అవకాశం రావడంతో.. కన్నడ హారర్ సినిమా 6-5=2 ద్వారా సిల్వర్ స్క్రీన్‌ లోకి అడుగు పెట్టింది. ఈ సినిమా తెలుగులో చిత్రం కాదు ఇది నిజం అనే టైటిల్ తో రిలీజ్ అయ్యింది. ఇక తర్వాత దండే బాయ్స్ అనే సినిమాలో కూడా కనిపించింది.

ఇలా మొత్తం 5 సినిమాల్లో తనూజ నటించింది. ఈ సినిమాలు అంతగా ఆడకపోవడంతో.. బుల్లితెరపై తనూజ తన అధృష్టాన్ని పరిక్షించుకోవాలనుకుంది. అలాగ తెలుగు బుల్లితెరపై వైపు తన ప్రయాణాన్ని మొదలు పెట్టింది. మొదటగా తెలుగులో అందాల రాక్షసి సీరియల్ లో నటించింది. ఆ తర్వాత ముద్దమందారం సీరియల్ లో హిరోయిన్ గా అవకాశం వచ్చింది. ఈ సీరియల్ లో తనూజ నటించిన పార్వతి పాత్రకు మంచి ఆదరణ లభించింది. ఒక్కసారిగా తనూజ చాలా పాపులర్ అయ్యింది. అదే సమయంలో ముద్దమందారం ఫేమ్ పవన్ సాయి, తనూజ కలిసి చాలా రియల్టీషోలలో పాల్గొన్నారు. ఆ సమయంలో వీలిద్దరి మధ్య కేమిస్ట్రీని చూసిన కొంతమంది.. రిలేషన్ లో ఉన్నారని మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. అయితే అప్పటికే పవన్ సాయికి ఎయిర్ హోస్టర్స్ అయిన మదుమతిని పెళ్లి చేసుకున్నాడు.. కానీ ఈ విషయాన్ని సీక్రెట్ గానే ఉంచాడు. తనూజ దగ్గర కూడా తనకు పెళ్లైనట్లు చెప్పలేదట. మరో వైపు పవన్ సాయి తనూజ పేర్లు సోషల్ మీడియాలో గట్టిగా వినిపించడంతో .. పవన్ సాయికి అతని భార్య కు గొడవలు వచ్చి.. అది విడాకుల వరకు దారి తీసింది.

మరోవైపు తన పెళ్లి విషయం పవన్ సాయి చెప్పలేదని తనూజ సైతం హర్ట్ అయ్యి తన మకాన్ని చెన్నైకి మార్చింది. అక్కడ తనూజ శివ మనసుల శక్తి సీరియల్ నటించి.. అక్కడ కూడా మంచి పేరు తెచ్చుకుంది. అయితే ఇండస్ట్రీ అంటనే పోటీ ప్రపంచం. దీపం ఉండగానే ఇళ్లు చక్కపెట్టుకోవాలి.. మనకు నచ్చినప్పుడు పనిచేస్తామంటే.. ఛాన్స్ లు రావు. తనూజకు కూడా అదే జరిగింది. ముద్దమందారం ద్వారా మంచి ఫేమ్ వచ్చిన కూడా దాన్ని కంటిన్యూ చేస్తూ.. తెలుగు వరుస సీరియల్స్ చేయ్యకుండా.. తమిళంలోకి వెళ్లింది. అక్కడ ఒక్క సీరియల్ తో సరిపెట్టుకుంది. ఆ తర్వాత అక్కడ పలు సినిమాలు చేసిన అనుకున్నంత ఫేమ్ రాలేదు.. దీంతో తనకు అదృష్టాన్ని తెచ్చిపెట్టిన తెలుగులోకే మళ్లీ ఎంట్రీ ఇచ్చింది. కానీ.. ఈమెకు అవకాశాలు ఇవ్వడానికి ఎవ్వరు ముందుకు రాలేదు. దీంతో జీ తెలుగులో వచ్చిన డాన్స్ రియల్టీ షోలో కూడా పాల్గొంది. ఆ తర్వాత పలు ఇంటర్వూలు ఇచ్చి.. మళ్లీ జనాలు తన గురించి మాట్లాడుకునేలా చేసుకుంది. ఆ తర్వాత కుక్ విత్ జాతి రత్నాలు షోలో కూడా తనూజ పాల్గొంది. ఇదే సమయంలో బిగ్ బాస్ 9 నుంచి ఆఫర్ వచ్చింది. Tanuja Gowda Real Story.

తను రోజుకు 25వేల రెమ్యూనిరేషన్ హాస్ లోకి అడుగుపెట్టింది. ఇక బిగ్ బాస్ స్టేజ్ పైనే తాను ఫ్యామిలీ గర్ల్‌, ఓవర్‌థింకర్‌, సెన్సిటివ్‌, మూడీ, క్రేజీ, అందంగా ఉంటాను, మంచి వంట చేస్తాను, అమాయకురాలిని, అనుకున్నది చేసేవరకు వదలని వ్యక్తిని అని చెప్పింది తనూజ. హౌస్ లోకి వెళ్లిన తర్వాత కూడా తన ఆట తీరుతో అందర్ని అలరిస్తోంది. తనుజా -కళ్యాణ్ పెయిర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఫ్రెండ్స్ గా ఉంటునే తమ గేమ్ ను ఆడుతున్నారు. దీంతో బయట ఈ బ్యూటీకి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెరిగిపోయింది. ఈ సీజన్ విన్నర్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయనే టాక్ మొదలైంది. చూడాలి మరీ రానున్న రోజుల్లో తన ఆట తీరుతో టాప్ -5 కి పరిమితం అవుతుందా..? లేక సీజన్ -9 విన్నర్ గా నిలుస్తుందా..? అని.