క్షణాల్లో సాయం…!

Spread the love

Deputy CM Bhatti Vikramarka: ప్రతి ఒక్కరికీ సమాన అవకాశం, సమాన గౌరవం అదే మన లక్ష్యమంటూ.. తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ముందుకు సాగుతన్నారు. రాజకీయ కుటుంబం నుంచి వచ్చినప్పటికీ కూడా భట్టి విక్రమార్క అంచెలంచెలుగా ఎదిగారు. ఇవాళ భట్టి అంటే భరోసా, ఒక సేవ, ఒక నమ్మకం అనే స్థాయికి చేరుకున్నారు. ప్రతిపక్షాలు సైతం మెచ్చుకునే విధంగా ఆయన రాజకీయలు ఉంటాయి. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తున్న కూడా తనను గెలిపించిన ప్రజలను మరువలేదు. ఆ నియోజకవర్గంలో కూడా అభివృద్ధిని వేగవంతం చేశారు. భట్టి డిప్యూటీ సీఎం అయిన కూడా ఇప్పటికీ ప్రజల వద్దకు వెళ్లి వారి కష్టాలను తెలుకుంటుంటారు.

పాదయాత్ర తో ప్రజల కష్టాలను తెలుసుకున్న భట్టి.. డిప్యూటీ సీఎం అయ్యాక కూడా.. ఆయనకు ఏ చిన్న సమయం దొరికిన కూడా.. ఆ సమయాన్ని ప్రజలకు కేటాయిస్తారు. ఈ నేపథ్యంలోనే భట్టి తన నియోజకవర్గమైన మధిర పర్యటించారు. పర్యటనలో భాగంగా..పలు అభివృద్ధి పనులు శంకుస్థాపన చేశారు. మధిర మండలం మడుపల్లి గ్రామంలో కాసిన వెంకటేశ్వరరావు కుటుంబాన్ని చూసి చేలించిపోయారు. చిన్ని టిఫెన్ కొట్టునే జీవినాధరంగా బతుకుతున్నాడు వెంకటేశ్వరరావు. గత కొంతకాలంగా వెంకటేశ్వరరావు.. అతని భార్య జయమ్మ అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో అది చిన్న టిఫెన్ కొట్టును తమ ఇద్దరు కుమారులు నడిపిస్తున్నారు. Deputy CM Bhatti Vikramarka.

కనీస వసతులు లేని ఇంట్లో, ప్రతి నెల ఇద్దరు దంపతులకు మందులు ఖర్చు, నలుగురుకి అయ్యే ఖర్చులను టిపెన్ సెంటర్ మీద వెల్లదీయ్యాల్సిన పరిస్థితి. రెక్కడితే కానీ.. డొక్కాడని పరిస్థితిని తెలుసుకున్న భట్టి.. క్షణం ఆలోచించకుడా పేద కుటుంబం వద్దకు వెళ్లారు. ఆ దంపతులతో మాట్లాడారు. వెంటనే అక్కడున్న అధికారులను పిలిపించి.. వారికి పెద్ద టిఫెన్ సెంటర్ పెట్టుకోవాల్సిన కావాల్సిన లోన్ ను మంజూరు చేశారు. క్షణాల్లో డిప్యూటీ సీఎం స్పందించడంపై బాధిత కుటుంబ సంతోషం వ్యక్తం చేసింది. ఉప ముఖ్యమంత్రి అయ్యి ఉండి కూడా తమ సమస్యను తెలుసుకొని తమ వద్దకు రావడం.. నిజంగా తమ అదృష్టమని అంటున్నారు.ఇలాంటి నాయకులు ఉంటే.. మాలాంటి వాళ్లకు కొండంత అండగా ఉంటుందని బాధిత కుటుంబసభ్యులు చెబుతున్నారు.