చరణ్..నువ్వు ఎదిగిన తీరు చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది:మెగాస్టార్ చిరంజీవి

Spread the love

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నేడు పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పాటు పలు రంగాలకు చెందిన ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అలాగే రామ్ చరణ్ తండ్రి మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ కు విషెస్ చెబుతూ ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. చరణ్ బాబు…చిన్నప్పుడు నా చేయి పట్టుకుని నడిపించిన స్థాయి నుండి, ఈరోజు ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచే స్థాయికి నువ్వు ఎదిగిన తీరు చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది.సినిమాలను, వ్యక్తిగత జీవితాన్ని నువ్వు సమన్వయం చేసుకునే విధానం, కుటుంబం పట్ల నీకున్న బాధ్యతాయుతమైన ప్రవర్తన, దైవచింతన, క్రమశిక్షణ మరియు నీ విలువలు… ఇవన్నీ చూసిన ప్రతిసారీ నీపై నాకున్న ప్రేమాభిమానాలు మరింత పెరుగుతూనే ఉంటాయి.దేవుని ఆశీస్సులు, అభిమానుల ప్రేమ నిన్ను ఎప్పుడూ ఉన్నత శిఖరాల వైపు నడిపించాలని కోరుకుంటున్నానని ఆయన భావోద్వేగ పోస్ట్ ను పెట్టారు. మరోవైపు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా చరణ్ కు శుభాకాంక్షలు తెలిపారు. రామ్ చరణ్ కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. నటన పట్ల అంకిత భావం కలిగిన రామ్ చరణ్ ప్రతి చిత్రాన్ని తపనతో చేస్తారు. కుటుంబ బంధాలకు విలువనిస్తూ పెద్దల పట్ల గౌరవం కనబరుస్తూ, సహచర నటులు, సాంకేతిక నిపుణులు, దర్శకులు, రచయితలతో మర్యాదగా మెలుగుతారు. ఆధ్యాత్మిక చింతన మెండుగా ఉంది. ఇవే రామ్ చరణ్ కు ఎల్లవేళలా శ్రీరామరక్ష. రామ్ చరణ్ కు మరిన్ని విజయాలు, సంపూర్ణ ఆనందాన్ని ఇవ్వాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని పవన్ పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *