తిరిగి భారత్ కు చేరనున్న అమూల్యమైన పురాతన వస్తువులు 

Spread the love

స్మిత్సోనియన్ నేషనల్ మ్యూజియం ఆఫ్ ఏషియన్ ఆర్ట్ నుండి మూడు అమూల్యమైన పురాతన వస్తువులు తిరిగి భారతదేశానికి చేరుకోనున్నాయి. వీటిలో 9వ శతాబ్దానికి చెందిన శివ నటరాజ కాంస్య విగ్రహం, 12వ శతాబ్దానికి చెందిన శివ-ఉమా శిల్పం, మరియు 16వ శతాబ్దానికి చెందిన సుందరార్-పరవై నాచియార్ విగ్రహం ఉన్నాయి. ఈ మేరకు డెప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ అంబాసిడర్ నమ్గ్యా ఖంపా మరియు NMAA డైరెక్టర్ డాక్టర్ చేజ్ రాబిన్సన్ ఒక ఒప్పందంపై సంతకం చేశారు. ఈ పురాతన వస్తువుల మూలాలపై (Provenance research) జరిపిన విచారణలో, ఇవి భారతదేశం నుండి అక్రమంగా తరలించబడినట్లు మ్యూజియం గుర్తించింది. శివ నటరాజ కాంస్య విగ్రహం ప్రస్తుతం అక్కడే ‘లోన్’ ప్రాతిపదికన ప్రజల సందర్శనార్థం ఉంచబడుతుంది. ఇది సందర్శకులకు భారతదేశం యొక్క గొప్ప కళాత్మక మరియు ఆధ్యాత్మిక వారసత్వాన్ని గురించి అవగాహన కల్పిస్తుంది. ఈమేరకు యూ.ఎస్. లోని భారత ఎంబసీ ‘ఎక్స్’ లో పోస్ట్ చేసింది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *