
Coolie Trailer Real Talk: కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్, టాలీవుడ్ కింగ్ నాగార్జున, కన్నడ స్టార్ ఉపేంద్ర, బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్.. ఈ క్రేజీ కాంబోలో రూపొందిన భారీ పాన్ ఇండియా మూవీ కూలీ. లోకేష్ కనకరాజ్ తెరకెక్కించిన కూలీ సినిమా పై ఫస్ట్ నుంచి భారీగా బజ్ క్రియేట్ అయ్యింది. ఆగష్టు 14న కూలీ మూవీని భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. చెన్నైలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూలీ ట్రైలర్ రిలీజ్ చేశారు. మరి.. కూలీ ట్రైలర్ ఎలా ఉంది..? ఈ ట్రైలర్ అంచనాలు పెంచిందా..? లేక అంచనాలు తగ్గించిందా..? కూలీ ట్రైలర్ రియల్ టాక్ ఏంటి..?
కూలీ సినిమా నుంచి అసలు ట్రైలరే రిలీజ్ చేయకుండా డైరెక్ట్ గా ఈ సినిమాను థియేటర్స్ లో రిలీజ్ చేస్తారని ప్రచారం జరిగింది. అయితే.. ఆగష్టు 2న ట్రైలర్ రిలీజ్ చేస్తామని లోకేష్ కనకరాజ్ ప్రకటించాడు. అనౌన్స్ చేసినట్టుగానే.. కూలీ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇందులో రజినీ, నాగ్, ఉపేంద్ర, అమీర్ ఖాన్.. ఇలా ఇందులో నటించిన ఆర్టిస్టుల క్యారెక్టర్స్ ఎలా ఉంటాయో క్లారిటీ ఇచ్చారు. అయితే.. ఈ ట్రైలర్ చూస్తుంటే.. భాషా సినిమాను లోకేష్ కనకరాజ్ తనదైన స్టైల్ లో తీసారనిపిస్తుంది. ఎందుకంటే.. ఇందులో ఫ్రెండ్ షిప్, లవ్, ఎమోషన్, యాక్షన్.. ఇలా అన్నీ అంశాలు కలిపిన కథలా అనిపిస్తుంది.
లోకేష్ మార్కు స్టైలిష్ టేకింగ్, ఎలివేషన్లు ట్రైలర్‌లో హైలైట్ అయినా.. రజినీ, నాగ్, అమీర్ ఖాన్ చాలా అట్రాక్టివ్‌గానే కనిపించినా.. కేవలం క్యారెక్టర్ల పరిచయానికే ట్రైలర్‌ను వాడుకున్నారని.. కథ గురించి పెద్దగా చెప్పలేదనే టాక్ వచ్చింది. అలాగే వావ్ అనిపించేలా డైలాగులు లేవనే ఫీడ్ బ్యాక్ వచ్చింది. ఇప్పటి వరకు ఉన్న హైప్ సరిపోతుంది అంతకు మించి హైప్ ఉంటే.. అంచనాలను అందుకోవడం కష్టమౌతుందనే ఇలా ట్రైలర్ కట్ చేశారా అనే డౌట్ కూడా వస్తుంది. థియేటర్స్ లో చాలా సర్ ఫ్రైజ్ లు ప్లాన్ చేశాడని టాక్ వినిపిస్తుంది. Coolie Trailer Real Talk.
రజినీతో లోకేష్ కనకరాజ్.. ఏదో ప్రయోగం చేయబోతున్నాడా..? ఇదేమైనా టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో రూపొందిన సినిమా..? అసలు ఏం చూపించబోతున్నాడు..? ఇలా అనేక ప్రశ్నలు. ట్రైలర్ లో స్టోరీ ఏంటి అనేది పెద్దగా చెప్పకపోవడంతో మరింతగా క్యూరియాసిటీ పెరిగింది. ఈమధ్య కాలంలో రజినీ చేసిన సినిమాల్లో ఏ సినిమాకి రానంత క్రేజ్ ఈ మూవీకి వచ్చింది. దీనికి తగ్గట్టుగా సంగీత సంచలనం అనిరుథ్ మ్యూజిక్ వేరే లెవల్లో ఇచ్చాడు. అయితే.. వావ్ అనిపించేలా ట్రైలర్ ఉంటుంది అనుకుంటే.. అంత గొప్పగా లేదని చెప్పచ్చు. ఇది హైప్ మరింతగా పెరగకుండా ఉండేందుకే ఇలా ట్రైలర్ కట్ చేశాడని టాక్. మరి.. కూలీ బాక్సాఫీస్ దగ్గర ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తుందో చూడాలి.
Also Read: https://mega9tv.com/cinema/pawan-kalyans-og-firestorm-song-creating-sensation-in-the-youtube/