ఒక్క సాంగ్ తో దుమ్ములేపుతున్న ఓజీ సాంగ్!

Spread the love

Pawan Kalyan’s OG Firestorm: పవర్ స్టార్ పవన కళ్యాణ్‌ హీరోగా సుజిత్ తెరకెక్కిస్తోన్న మూవీ ఓజీ. ఈ సినిమా ఎప్పుడెప్పుడు థియేటర్స్ లోకి వస్తుందా అని పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. సెప్టెంబర్ 25న ఓజీ సినిమాను భారీ స్థాయిలో థియేటర్స్ లోకి రిలీజ్ చేసేందుకు రెడీ అవుతోంది. అయితే.. రిలీజ్ కి ఇంకా టైమ్ ఉన్నప్పటికీ.. ఇప్పటి నుంచే ప్రమోషన్ స్టార్ట్ చేశారు. ఓజీ ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు. మరి.. ఈ ఫస్ట్ సింగిల్ ఎలా ఉంది..? మేకర్స్ ప్రమోషన్స్ ప్లాన్ ఏంటి..?

ఓజీ మూవీలో పవర్ స్టార్ గ్యాంగ్ స్టర్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎలా చూడాలి అనుకుంటున్నారో అలా సుజిత్ చూపిస్తుండడంతో ఈ సినిమా పై మరింత క్రేజ్ పెరిగింది. ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు. ఫైర్ వర్క్స్ పేరుతో ఎస్ఎస్ థమన్ కంపోజ్ చేసిన ఫస్ట్ సాంగ్ యూట్యూబ్ లోకి వచ్చేసింది. తెలుగు, ఇంగ్లీష్, జపనీస్ మూడు భాషల పదాలు పొందుపరిచి చేసిన వెరైటీ ప్రయోగం ఆకట్టుకునేలా ఉంది. ముఖ్యంగా యానిమేషన్ల రూపంలో సినిమాలోని కొన్ని కీలక యాక్షన్ సీన్లను చూపించి చూపించకుండా రివీల్ చేసిన విధానం బాగుంది.

ఈ పాటకు విశ్వ, శ్రీనివాస మౌళి తెలుగు లిరిక్స్ అందించగా.. రాజకుమారి ఇంగ్లీష్, అద్వితీయ వొజ్జల జపాన్ సాహిత్యం సమకూర్చారు. ఫాస్ట్ బీట్స్ లో పగ రగిలిన పైరు కలబడితే గుండెల్లో ఫియరూ అంటూ క్యాచీ పదాలతో చేసిన ప్రయోగాలు బాగున్నాయి. ఈ సాంగ్ ను బట్టి సుజిత్ ఎంత కేర్ తీసుకున్నాడో అర్థమౌతుంది. సాంగ్స్ ఖచ్చితంగా హిట్ అవుతాయి అనే ఫీలింగ్ కలిగించింది. సెప్టెంబర్ 25న ఓజీ రిలీజ్ అని ప్రకటించినా.. ఆ డేట్ కి రాకపోవచ్చు.. పోస్ట్ పోన్ అవ్వచ్చు అని ప్రచారం జరుగుతూనే ఉంది. అయితే.. ఈ సాంగ్ తో మరోసారి సెప్టెంబర్ 25న ఓజీ రిలీజ్ అని అనౌన్స్ చేయడంతో ఈసారి పక్కాగా ఓజీ వస్తుంది అనిపిస్తుంది. Pawan Kalyan’s OG Firestorm.

ఈ సాంగ్ ఇలా రిలీజ్ అయ్యిందో లేదో అలా యూట్యూబ్ లో దూసుకుంటూ వెళుతుంది. ఈ సాంగ్ తో ఇప్పటి వరకు ఉన్న ఎక్స్ పెక్టేషన్స్ మరింత పెరిగాయి అని చెప్పచ్చు. డీవీవీ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై డీవీవీ దానయ్య ఈ సినిమాని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. వీరమల్లు సినిమాని పవర్ స్టార్ ఎంతలా ప్రమోట్ చేసారో.. ఈ మూవీని కూడా అదే స్థాయిలో ఇంకా చెప్పాలంటే.. అంతకు మించి అనేలా ప్రమోషన్స్ చేయాలి అనుకుంటున్నారట. త్వరలోనే పవర్ స్టార్ ఎప్పటి నుంచి ఓజీ ప్రమోషన్స్ లోకి దిగుతారు అనేది క్లారిటీ వస్తుంది. మరి.. వీరమల్లుతో మిస్సైన బ్లాక్ బస్టర్ ఓజీతో సాధిస్తారేమో చూడాలి.

పవర్ స్టార్ పవన కళ్యాణ్‌ హీరోగా సుజిత్ తెరకెక్కిస్తోన్న మూవీ ఓజీ. ఈ సినిమా ఎప్పుడెప్పుడు థియేటర్స్ లోకి వస్తుందా అని పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. సెప్టెంబర్ 25న ఓజీ సినిమాను భారీ స్థాయిలో థియేటర్స్ లోకి రిలీజ్ చేసేందుకు రెడీ అవుతోంది. అయితే.. రిలీజ్ కి ఇంకా టైమ్ ఉన్నప్పటికీ.. ఇప్పటి నుంచే ప్రమోషన్ స్టార్ట్ చేశారు. ఓజీ ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు. మరి.. ఈ ఫస్ట్ సింగిల్ ఎలా ఉంది..? మేకర్స్ ప్రమోషన్స్ ప్లాన్ ఏంటి..?

ఓజీ మూవీలో పవర్ స్టార్ గ్యాంగ్ స్టర్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎలా చూడాలి అనుకుంటున్నారో అలా సుజిత్ చూపిస్తుండడంతో ఈ సినిమా పై మరింత క్రేజ్ పెరిగింది. ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు. ఫైర్ వర్క్స్ పేరుతో ఎస్ఎస్ థమన్ కంపోజ్ చేసిన ఫస్ట్ సాంగ్ యూట్యూబ్ లోకి వచ్చేసింది. తెలుగు, ఇంగ్లీష్, జపనీస్ మూడు భాషల పదాలు పొందుపరిచి చేసిన వెరైటీ ప్రయోగం ఆకట్టుకునేలా ఉంది. ముఖ్యంగా యానిమేషన్ల రూపంలో సినిమాలోని కొన్ని కీలక యాక్షన్ సీన్లను చూపించి చూపించకుండా రివీల్ చేసిన విధానం బాగుంది.

ఈ పాటకు విశ్వ, శ్రీనివాస మౌళి తెలుగు లిరిక్స్ అందించగా.. రాజకుమారి ఇంగ్లీష్, అద్వితీయ వొజ్జల జపాన్ సాహిత్యం సమకూర్చారు. ఫాస్ట్ బీట్స్ లో పగ రగిలిన పైరు కలబడితే గుండెల్లో ఫియరూ అంటూ క్యాచీ పదాలతో చేసిన ప్రయోగాలు బాగున్నాయి. ఈ సాంగ్ ను బట్టి సుజిత్ ఎంత కేర్ తీసుకున్నాడో అర్థమౌతుంది. సాంగ్స్ ఖచ్చితంగా హిట్ అవుతాయి అనే ఫీలింగ్ కలిగించింది. సెప్టెంబర్ 25న ఓజీ రిలీజ్ అని ప్రకటించినా.. ఆ డేట్ కి రాకపోవచ్చు.. పోస్ట్ పోన్ అవ్వచ్చు అని ప్రచారం జరుగుతూనే ఉంది. అయితే.. ఈ సాంగ్ తో మరోసారి సెప్టెంబర్ 25న ఓజీ రిలీజ్ అని అనౌన్స్ చేయడంతో ఈసారి పక్కాగా ఓజీ వస్తుంది అనిపిస్తుంది.

ఈ సాంగ్ ఇలా రిలీజ్ అయ్యిందో లేదో అలా యూట్యూబ్ లో దూసుకుంటూ వెళుతుంది. ఈ సాంగ్ తో ఇప్పటి వరకు ఉన్న ఎక్స్ పెక్టేషన్స్ మరింత పెరిగాయి అని చెప్పచ్చు. డీవీవీ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై డీవీవీ దానయ్య ఈ సినిమాని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. వీరమల్లు సినిమాని పవర్ స్టార్ ఎంతలా ప్రమోట్ చేసారో.. ఈ మూవీని కూడా అదే స్థాయిలో ఇంకా చెప్పాలంటే.. అంతకు మించి అనేలా ప్రమోషన్స్ చేయాలి అనుకుంటున్నారట. త్వరలోనే పవర్ స్టార్ ఎప్పటి నుంచి ఓజీ ప్రమోషన్స్ లోకి దిగుతారు అనేది క్లారిటీ వస్తుంది. మరి.. వీరమల్లుతో మిస్సైన బ్లాక్ బస్టర్ ఓజీతో సాధిస్తారేమో చూడాలి.

Also Read: https://mega9tv.com/cinema/devara-part-2-in-suspense-what-is-the-koratala-siva-plan/