హనుమాన్ జయంతి సందర్భంగా ‘పెద్ది’ నుండి ఆసక్తికర పోస్టర్

Spread the love

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘పెద్ది’  ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల విడుదలైన గ్లింప్స్‌లో చరణ్ కనిపించిన కొత్త లుక్ అభిమానులను మాత్రమే కాదు, సినీ ప్రేమికులందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. గ్రామీణ క్రికెటర్‌గా కనిపించిన ఆయన ఒక్కసారిగా పహిల్వాన్‌లా మారిపోయిన విధానం సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. ముఖ్యంగా చరణ్ బర్త్‌డే సందర్భంగా విడుదలైన పహిల్వాన్ గ్లింప్స్ లో ఆయన కనిపించిన విధానం  ఇప్పుడు ఇంటర్నెట్ అంతా హాట్ టాపిక్ గా మారింది. మట్టి లో కుస్తీలు పడుతూ, పవర్ ఫుల్ బాడీ లాంగ్వేజ్ తో  కనిపించిన చరణ్ లుక్ నిజంగా అభిమానులకు కొత్త అనుభూతిని ఇచ్చింది. ఇక నేడు హనుమాన్ జయంతిని పురస్కరించుకొని చిత్ర బృందం కొత్త పోస్టర్ ను విడుదల చేసింది. గదతో ఉన్న చరణ్ లుక్ ఆకట్టుకుంటోంది. ఈ చిత్రం ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. జాన్వీకపూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని బుచ్చిబాబు సాన దర్శకత్వం వహిస్తుండగా..వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. ఏ.ఆర్.రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. జగపతి బాబు, శివ రాజ్ కుమార్ తదితరులు కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *