ఆ ఒక్క పెయింటింగ్ రూ.167 కోట్లు..రికార్డు సృష్టించిన రాజా రవి వర్మ పెయింటింగ్

Spread the love

భారతీయ చిత్రకళా రంగంలో అగ్రగణ్యుడుగా పేరొందిన చిత్రకారుడు రాజా రవి వర్మ గీసిన ఒక పెయింటింగ్ వేలంలో రికార్డు ధర పలికింది. యశోద మాత చిన్ని కృష్ణుడు ఉన్న ఆ పెయింటింగ్ ఏకంగా రూ.167.2కోట్ల ధరతో సరికొత్త రికార్డు సృష్టించింది. ముంబైలోని సాఫ్రాన్ ఆర్ట్ స్ప్రింగ్ లైవ్ ఆక్షన్ నిన్న ముంబైలో జరిగింది. ఆక్షన్ లో రాజా రవి వర్మ గీసిన ఈ పెయింటింగ్ సొంతం చేసుకునేందుకు అనేకమంది పోటీపడ్డారు. అయితే ప్రముఖ ఇనుస్ట్రియలిస్ట్, సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకులు సైరస్ పూనావాలా దీనిని సొంతం చేసుకున్నారు. 1890లో గీసిన ఈ అద్భుతమైన పెయింటింగ్ ను రూ.167 కోట్లకు కొన్నారు. గత సంవత్సరం భారత్ కు చెందిన ప్రముఖ చిత్రకారుడు ఎం.ఎఫ్.హుస్సేన్ గీసిన ఒక పెయింటింగ్ రూ.118 కోట్లకు అమ్ముడుబోయి రికార్డు సృష్టించగా..ఇప్పుడు ఆ రికార్డును భారీ తేడాతో ఈ పెయింటింగ్ అధిగమించి సత్తాచాటింది. ఈ  పెయింటింగ్ ను దక్కించుకోవడం పట్ల పూనావాలా సంతోషం వ్యక్తం చేశారు.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *