రజినీ కూలీ కోసం రంగంలోకి లోక నాయకుడు..!

Spread the love

Kamal enters the fray for Rajini’s Coolie: కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్, టాలీవుడ్ కింగ్ నాగార్జున, కన్నడ స్టార్ ఉపేంద్ర, బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్.. ఈ క్రేజీ కాంబినేషన్లో రూపొందుతోన్న మూవీ కూలీ. ఈ సినిమాని ప్రకటించినప్పటి నుంచి రోజురోజుకు అంచనాలు పెంచుకుంటూ వచ్చింది. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన కంటెంట్ తో అంచనాలు ఆకాశంలో ఉన్నాయి. ఈ సినిమా కోసం సినీ అభిమానులే కాకుండా.. కామన్ ఆడియన్స్ సైతం ఎంతో క్యూరియాసిటీతో వెయిట్ చేస్తున్నారు. ఆగష్టు 14న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. ఇదిలా ఉంటే.. కూలీ కోసం లోకనాయకుడు రంగంలోకి దిగుతున్నాడు అనేది ఫ్యాన్స్ లో హాట్ టాపిక్ అయ్యింది. ఇంతకీ.. కూలీ కోసం లోక నాయకుడు ఏం చేయబోతున్నాడు..? కూలీ ఎలా ఉండబోతుంది..?

రజినీకాంత్, కమల్ హాసన్ వీరిద్దరి మధ్య ఎంత స్నేహం ఉందో అందరికీ తెలిసిందే. నువ్వా – నేనా.. అన్నట్టుగా పోటీపడినా.. ఇద్దరూ మంచి మిత్రులు. సమయం.. సందర్భంగా వచ్చినప్పుడల్లా.. ఒకరికొకరు సాయం చేసుకుంటూనే ఉంటారు. ఇక అసలు విషయానికి వస్తే.. కూలీ కోసం కమల్ మాట సాయం చేయబోతున్నారట. ఇంతకీ.. మాట సాయం ఏంటి అనుకుంటున్నారా..? ఈ సినిమాకి కమల్ హాసన్ వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నాడట.డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కమల్‌ను రిక్వెస్ట్ చేయడంతో, ఆయన వెంటనే ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. Kamal enters the fray for Rajini’s Coolie.

లోకేష్‌ కనకరాజ్.. కమల్ ఫ్యాన్. గతంలో కమల్ తో విక్రమ్ అనే సినిమా చేయడం తెలిసిందే. ఆ సినిమాతో కమల్ కు ఉన్న అప్పులు అన్నీ తీరిపోయాయి. ఇంతటి విజయాన్ని ఇచ్చిన లోకేష్ అంటే.. కమల్ కు ఎంతో ఇష్టం. అందుకనే లోకేష్‌ అడగగానే వేరే ఆలోచన లేకుండా వెంటనే ఓకే చెప్పారట. పైగా అది తన మిత్రుడు రజినీకాంత్ సినిమా. కమల్ కాదని ఎందుకు అంటారు. గతంలో కమల్, రజినీ కలిసి నటించిన సంగతి కూడా తెలిసిందే. ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత మళ్లీ రజినీ సినిమాలో కమల్ వాయిస్ ఓవర్ వినిపిస్తుందనే వార్తతో అభిమానుల్లో మరింత జోష్ పెరిగింది.

కూలీ సినిమాలో ఇంత మంది భారీ తారాగణం ఉంది. ఎవరి క్యారెక్టర్స్ ఎలా ఉంటాయి..? అసలు కథ ఏంటి..? ఈ సినిమాతో లోకేష్‌ ఏం చెప్పబోతున్నాడు..? ఇలా అనేక ప్రశ్నలు. ఈ సినిమాతో లోకేష్‌ ఏం చెబుతున్నాడు అనే కంటే… ఈ సినిమాకి వచ్చిన ప్రతి ఆడియన్ ఎంటర్ టైన్ అవుతాడు అనేది మాత్రం గ్యారెంటీ. ఇది అందరూ చెబుతున్న మాట. మరో ఆసక్తకర విషయం ఏంటంటే.. ఒక హీరోతో సినిమా చేయాలంటేనే సంవత్సరాలు సంవత్సరాలు టైమ్ తీసుకుంటున్నారు. అలాంటిది ఇంత మంది హీరోలను పెట్టుకుని.. చాలా అంటే చాలా ఫాస్ట్ గా ఈ కూలీ మూవీని పూర్తి చేయడం విశేషం. మరి.. ఆగష్టు 14న కూలీ ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో.. బాక్సాఫీస్ దగ్గర ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి.

Also Read: https://mega9tv.com/cinema/power-star-fans-vs-bunny-fans-the-pawan-and-bunny-fans-controversy-is-back-on-the-screen-the-pawan-and-bunny-fans-controversy-has-gone-viral-on-social-media/