మళ్లీ తెరపైకి పవన్ వెర్సెస్ బన్నీ..!

Spread the love

Power Star Fans vs. Bunny Fans: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్య వార్ గురించి తెలిసిందే. ఆమధ్య సోషల్ మీడియాలో పెద్ద రచ్చే జరిగింది. ఒకప్పుడు అంతా మెగా ఫ్యాన్స్ గానే ఉండేవారు.. ఆతర్వాత మెగా ఫ్యాన్స్, బన్నీ ఫ్యాన్స్ అంటూ అభిమానులు విడిపోయి గొడవపడ్డారు. సోషల్ మీడియాలో అయితే.. మెగా ఫ్యాన్స్.. బన్నీ ఫ్యాన్స్ ఒకరి పై మరోకరు పోస్టులు పెట్టడం.. వైరల్ అవ్వడం తెలిసిందే. ముఖ్యంగా పవన్ ఫ్యాన్స్, బన్నీ ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియా వేదికగా వార్ నడిచింది. ఈ వార్ ఇక లేదు అంతా ఒకటే అనుకుంటే.. మళ్లీ ఈ వార్ స్టార్ట్ అయ్యింది. దీనంతటికి కారణం ఏంటి..? అసలు ఏమైంది..?

సరైనోడు సక్సెస్ మీట్ లో బన్నీ మాట్లాడుతుంటే.. పవర్ స్టార్ ఫ్యాన్స్.. పవన్ కళ్యాణ్ గురించి చెప్పమని అడగడం జరిగింది. అప్పుడు బన్నీ చెప్పను బ్రదర్ అన్నాడు. అంతే అక్కడ నుంచి బన్నీ ఫ్యాన్స్ వెర్సెస్ పవన్ ఫ్యాన్స్ రచ్చ మొదలైంది. సోషల్ మీడియాలో చెప్పను బ్రదర్ అనేది ట్రెండ్ అయ్యింది. ఈ వివాదం పై బన్నీ అప్పట్లో ఏమన్నాడంటే.. మెగా ఫ్యామిలీకి సంబంధం లేని ఈవెంట్లలోనూ మీరు పవర్ స్టార్ అని అరవడం వల్ల మిగతా హీరోలు హర్ట్ అవుతున్నారని చెప్పుకొచ్చాడు. దీనికి ఫుల్‌ స్టాప్‌ పెట్టాలనే ఆరోజు చెప్పను బ్రదర్ అన్నానని క్లారిటీ ఇచ్చాడు. మేం మేం బాగానే ఉంటాం. మీ ఫ్యాన్సే అనవసరంగా కొట్టుకుంటారు. దయచేసి ఇలా సోషల్‌ మీడియాలో గొడవలు పడుతూ.. మీ స్థాయిని తగ్గించుకొని, మా స్థాయిని తగ్గించొద్దని రిక్వెస్ట్ చేశాడు బన్నీ. Power Star Fans vs. Bunny Fans.

బన్నీకి పవన్ కళ్యాణ్ అంటే నిజంగా ఇష్టం లేదా..? లేక ఇష్టం ఉన్నప్పటికీ ఆయన పేరు ప్రస్తావించడం ఇష్టం లేదా..? ఎందుకు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడడానికి బన్నీ ఇంట్రెస్ట్ చూపించడు అనేది అప్పట్లో హాట్ టాపిక్ అయ్యింది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ గారు.. చాలా సార్లు నేను ఈ స్ధాయిలో ఉండ‌టానికి మా అన్న‌య్యే కార‌ణం అని చెప్పారు. అలాంటిది చిరంజీవి గారు మాట్లాడుతున్న‌ప్పుడు కూడా మాట్లాడ‌నీయ‌కుండా పవర్ స్టార్ అని అరుస్తున్నారు. అది క‌రెక్ట్ కాదు అని బన్నీ చెప్పారు. అభిమానులు అలా చేయ‌డం న‌చ్చ‌లేదు. మ‌న‌కి ఒక‌ ఫ్లాట్ ఫామ్ ఏర్ప‌ర‌చిన‌ చిరంజీవి గార్ని కూడా మాట్లాడ‌కుండా చేస్తున్నారు. మీరు ఎంత అర‌చినా నేను ప‌వ‌న్ గురించి మాట్లాడ‌ను. ప‌వ‌న్ క‌ళ్యాణ్ గురించి ఎన్ని సార్లు చెప్ప‌లేదు. ఆయ‌న మీద ఉన్న ఇష్టం ఎన్ని సినిమాల్లో చెప్ప‌లేదు. చిరంజీవి గారు త‌ర్వాత ప‌బ్లిక్ ఫంక్ష‌న్ లో నాకు స‌పోర్ట్ చేసింది ప‌వ‌న్ క‌ళ్యాణ్ గారే అని బన్నీ ఓ ఇంటర్ వ్యూలో చెప్పారు.

ద‌య‌చేసి విష‌యం అర్థం చేసుకోండి. నేను ఈమ‌ధ్య‌ క‌ళ్యాణ్ గారు గురించి అడిగిన‌ప్పుడు చెప్ప‌లేదు.. కాంట్ర‌వ‌ర్సీ ఎందుకు అని ఎవాయిడ్ చేసాను కానీ.. ఎవాయిడ్ చేయ‌డం వ‌ల‌న ఇంత కాంట్ర‌వ‌ర్సీ వ‌స్తుంద‌ని ఊహించ‌లేదన్నారు బన్నీ. ఇలా బన్నీ క్లారిటీ ఇవ్వడంతో ఈ సమస్య లేనట్టే అనుకున్నారు..అయితే.. ఎన్నికల టైమ్ లో బన్నీ వైసీపీ అభ్యర్థికి సపోర్ట్ చేయడంతో మళ్లీ బన్నీ ఫ్యాన్స్ వెర్సెస్ పవన్ ఫ్యాన్స్ అనే రచ్చ స్టార్ట్ అయ్యింది. ఇటీవల బన్నీ అరెస్ట్ అయినప్పుడు మెగాస్టార్ చిరంజీవి సపోర్ట్ గా నిలిచారు. ఆతర్వాత బన్నీ చిరంజీవి ఇంటికి వెళ్లవడం అంతా క్లియర్ అయినట్టే అంతా ఒక్కటే అనిపించింది.

ఇప్పుడు వీరమల్లు సినిమా రిలీజ్ అవుతున్న ఈ టైమ్ లో మళ్లీ రచ్చ స్టార్ట్ అయ్యింది. మేటర్ ఏంటంటే.. పుష్ప 2 రికార్డులను వీరమల్లు బద్దలు కొడుతుందని పవన్ ఫ్యాన్స్ వాదన. దీనికి బన్నీ ఆర్మీకి కోపం వచ్చింది. దీంతో సోషల్ మీడియా వేదికగా అభిమానులు గొడవపడుతున్నారు. అయితే.. ఊహించని విధంగా ఈ వివాదం మరో టర్న్ తీసుకుంది. పవన్ కళ్యాణ్ భార్య అన్నా పై అభ్యంతరకర పోస్టులు పెట్టడంతో కొందరి పై కేసులు పెట్టారు. బన్నీ అభిమానుల హ్యాండిల్స్ బ్లాక్ చేశారు. దీంతో ఈ వివాదం మరింత ముదిరింది. మరి.. ఈ వివాదం ఎంత వరకు వెళుతుందో.. ఏం జరుగనుందో చూడాలి.

Also Read: https://mega9tv.com/cinema/veeramallu-vandalized-at-the-box-office-old-records-are-broken-veeramallu-records-fair-theaters-are-bustling-with-the-arrival-of-veeramallu/