అదూర్ గోపాలకృష్ణన్ దర్శకత్వంలో  మమ్ముట్టి ‘పాదయాత్ర’

Spread the love

మమ్ముట్టి మలయాళ నటుడైనప్పటికీ అన్ని భాషలలో మంచి ప్రేక్షకాదరణ సొంతం చేసుకున్న నటుడు. ఆయన డబ్బింగ్ చిత్రాలు అన్ని భాషలలో విడుదలై మంచి విజయాలను సొంతం చేసుకున్న సందర్భాలెన్నో. తెలుగులో కూడా ఆయన్ను విశేషంగా అభిమానిస్తుంటారు. గతంలో వై.ఎస్.ఆర్ బయోపిక్ గా రూపొందిన ‘యాత్ర’ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ మలయాళ మెగాస్టార్ ఇప్పుడు ‘పాదయాత్ర’ అనే చిత్రంతో రానున్నారు.  అది  రాజకీయ నేపథ్యమున్న సినిమా కాగా, మమ్ముట్టి ఇప్పుడు తీయబోయేది కూడా పొలిటికల్ సినిమాయేనా? లేదంటే ఏదైనా డిఫరెంట్ కాన్సెప్ట్ అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికైతే పోస్టర్ ను మాత్రమే విడుదల చేశారు. ఈ చిత్రానికి అదూర్ గోపాలకృష్ణన్ దర్శకుడు. 84 ఏళ్ల ఈ డైరెక్టర్తో మమ్ముట్టి.. 32 ఏళ్ల తర్వాత మళ్లీ కలిసి పనిచేయనుండటం విశేషం. గతంలో వీళ్లిద్దరూ ‘విధేయన్’ అనే మూవీ చేశారు. దానికి బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ నేషనల్  అవార్డ్ కూడా వచ్చింది. అదూర్ గోపాలకృష్ణన్ సీనియర్ డైరెక్టర్ ఈయన తీసిన ‘స్వయంవరం’, ‘కొడియట్టం’, విధేయన్, మథిలుకళ్, అనంతరం, ముఖాముఖం, ఎలిపత్యం, కథాపురుషన్, నిళల్ కుతు, నాళ్ పెన్నుంగళ్ తదితర సినిమాలతో ఈయన నేషనల్ అవార్డులు దక్కించుకున్నారు. చివరగా 2016లో ఓ సినిమా చేసిన ఈయన.. ఇన్నాళ్లకు మమ్ముట్టి కలిసి పనిచేయబోతుండటం ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.