ఈ సంక్రాంతికి సినిమా సందడి ఇప్పటికే షురూ అయిపోయింది. ఇప్పటికే డార్లింగ్ ప్రభాస్ ‘రాజాసాబ్’ తో థియేటర్లలో సందడి చేస్తున్నారు. ఇప్పుడిక మెగాస్టార్ చిరంజీవి వంతు ఆయన నటించిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ ఈనెల 12న విడుదలకు రెడీ అయింది. చిరంజీవి కథానాయకుడిగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ పై భారీ అంచనాలున్నాయి. ఈ క్రమంలో స్పెషల్ ప్రీమియర్ తో పాటు, టికెట్ ధరలు పెంచుకునేందుకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి అనుమతులు వచ్చేశాయి. తాజాగా తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. జనవరి 11న స్పెషల్ ప్రీమియర్ కు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ షో టికెట్ ధరను రూ.600గా నిర్ణయించింది. రాత్రి 8 గంటల నుంచి 10 గంటల మధ్య షోను ప్రదర్శించాల్సి ఉంటుంది. జనవరి 12వ తేదీ నుంచి ఏడు రోజుల పాటు సింగిల్ స్క్రీన్ లో రూ.50 మల్టీప్లెక్స్లో రూ.100 టికెట్ ధర పెంచుకునే అవకాశం ఇచ్చింది. ఈ విషయాన్ని తెలుపుతూ జీవో జారీ చేసింది. ఇప్పటికే ఏపీలో పర్మిషన్ వచ్చిన సంగతి తెలిసిందే. ఏపీలో స్పెషల్ ప్రీమియర్ షో టికెట్ ధర రూ.500 కాగా సింగిల్ స్క్రీన్లో రూ.100, మల్టీప్లెక్స్ లలో రూ.125 టికెట్ ధర పెంచుకునే అవకాశాన్ని ఏపీ ప్రభుత్వం కల్పించింది. ఇక ఈ మూవీ లో చిరంజీవి సరసన నయనతార అలరించనుండగా.. మరో సీనియర్ నటుడు వెంకటేశ్ కీలక పాత్రలో కనిపించనున్నారు.