
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ భక్త కన్నప్ప. ఈ సినిమా కథ పై పదేళ్ల నుంచి కసరత్తు చేస్తూనే ఉన్నాడు. ముఖేష్ కుమార్ సింగ్ ఈ మూవీకి డైరెక్టర్. ఈ మూవీని చాలా ప్రతష్టాత్మకంగా తీసుకుని నిర్మించారు. ఇంకా చెప్పాలంటే.. విష్ణు మార్కెట్ ను మించి 100 కోట్లకు పైగా ఖర్చు పెట్టి ఈ సినిమాను నిర్మించారు. భారీ తారాగణం.. భారీ బడ్జెట్ తో రూపొందిన కన్నప్ప సినిమా ఈ నెల 27న భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. ఈ మూవీలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ముఖ్య పాత్ర పోషించాడు సరే.. మరి.. ప్రమోషన్స్ కు ప్రభాస్ వస్తాడా..? రాడా..? విష్ణు ఏమంటున్నాడు..? ఏం జరగనుంది..?
కన్నప్ప సినిమాను అమెరికాలో మంచు విష్ణు బాగా ప్రమోట్ చేస్తున్నాడు. ఇటీవల రోడ్ షోలతో ఈ మూవీ పై మరింతగా హైప్ క్రియేట్ చేశాడు. ఇప్పుడు ఈ మూవీ టీమ్ ఇండియాలో కూడా ప్రమోషన్స్ లో స్పీడు పెంచింది. ఈ సినిమాలో అక్షయ్ కుమార్ శివుడిగా, మోహన్‌లాల్ కిరాటగా, ప్రభాస్ రుద్రగా నటించారు. కన్నప్ప ప్రమోషన్స్‌లో భాగంగా భారీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగనుంది. అలాగే అక్షయ్ కుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. అలాగే కొచ్చిలో మోహన్‌లాల్ మీడియా మీట్ నిర్వహించి సినిమా గురించి ఆసక్తికర విషయాలను తెలపనున్నారు.
ఇదిలా ఉంటే.. కన్నప్ప ప్రమోషన్స్ లో ప్రభాస్ పాల్గొంటాడా లేదా అనేది హాట్ టాపిక్ అయ్యింది. ఈ సినిమాలో ప్రభాస్ ముఖ్య పాత్ర పోషించడమే గొప్ప విషయం. కారణం ఏంటంటే.. ప్రభాస్ ఇప్పుడు చాలా బిజీగా ఉన్నాడు. తను ఒప్పుకున్న సినిమాలకు డేట్స్ ఇవ్వడానికే టైమ్ కుదరడం లేదు. అలాంటిది కన్నప్ప సినిమాలో ముఖ్యపాత్ర చేయడం అంటే మామూలు విషయం కాదు. మోహన్ బాబుతో ఉన్న అనుబంధం కారణంగా ఈ సినిమాలో నటించేందుకు డార్లింగ్ ప్రభాస్ ఓకే చెప్పాడు. అయితే.. ఇప్పుడు ప్రభాస్ ను ప్రమోషన్స్ కు తీసుకువస్తాను అంటున్నాడు మంచు విష్ణు.
నార్త్ లో కానీ.. సౌత్ లో కానీ చేసే ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ప్రభాస్ ను తీసుకువస్తానని మంచు విష్ణు చాలా గట్టిగా చెబుతున్నాడు. ప్రభాస్ ఇటీవల ఇటలీ నుంచి ఇండియాకు వచ్చాడు. ప్రస్తుతం ప్రభాస్, ది రాజాసాబ్, ఫౌజీ సినిమాల షూటింగ్స్ లో బిజీగా ఉన్నాడు. దీంతో కన్నప్ప ప్రమోషన్స్ కు టైమ్ ఇస్తాడా..? అనేది ఆసక్తిగా మారింది. రాజాసాబ్ మూవీ రిలీజ్ కి రెడీ అవుతుంది. అందుచేత ఇప్పుడు కన్నప్ప ప్రమోషన్స్ కు వచ్చి.. మళ్లీ రాజాసాబ్ కోసం ప్రమోషన్స్ కు రావడం అంటే కాస్త కష్టమే. నిజంగా కన్నప్ప ప్రమోషన్స్ కు ప్రభాస్ వస్తే మాత్రం అది వేరే లెవల్లో ఉంటుంది. మరి.. ప్రభాస్ ఏ నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.