
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ దేవర. ఈ మూవీ ఎంతటి విజయం సాధించిందో తెలిసిందే. నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ.. 500 కోట్లుకు పైగా కలెక్ట్ చేయడం విశేషం. అయితే.. దేవర సినిమాకి వచ్చిన నెగిటివ్ టాక్ కారణంగా దేవర 2 ఉండదని ప్రచారం జరిగింది . కానీ.. దేవర 2 ఉంటుందని ఎన్టీఆర్ క్లారిటీ ఇవ్వడంతో ఈ ప్రాజెక్ట్ పై మరింత ఆసక్తి ఏర్పడింది. అయితే.. దేవర 2 సెట్స్ పైకి వచ్చేది ఎప్పుడు..? ఈ క్రేజీ మూవీ తర్వాత కొరటాల ప్లాన్ ఏంటి..?
ఎన్టీఆర్ ప్రస్తుతం వార్ 2, డ్రాగన్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ తో ఎన్టీఆర్ కలిసి నటిస్తోన్న వార్ 2 ఆగష్టు 14న రిలీజ్ కానుంది. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. ఇక ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో రూపొందుతోన్న డ్రాగన్ మూవీ కోసం ఎన్టీఆర్ పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ మూవీని నెక్ట్స్ ఇయర్ సమ్మర్ లో రిలీజ్ చేయాలి అనేది మేకర్స్ ప్లాన్. ఎన్టీఆర్ నటిస్తున్న ఈ రెండు సినిమాల పై అటు అభిమానుల్లోనూ, ఇటు ఇండస్ట్రీలోనూ భారీగా అంచనాలు ఉన్నాయి.
డ్రాగన్ మూవీ షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత దేవర 2 సినిమాను పట్టాలెక్కించాలి అనేది ఎన్టీఆర్ ప్లాన్. అయితే.. డ్రాగన్ మూవీ పూర్తవ్వడానికి ఇంకా టైమ్ ఉండడంతో ఇప్పుడు దేవర 2 కథ పై కసరత్తు చేస్తున్నారట కొరటాల. దేవర పార్ట్ 1 లో జరిగిన తప్పులు దేవర 2 లో జరగకుండా ఉండేలా కేర్ తీసుకుంటున్నారని తెలిసింది. అలాగే దేవర సినిమాను మించి ఉండేలా భారీగా ప్లాన్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. సైఫ్ ఆలీఖానే కాకుండా మరో బాలీవుడ్ విలన్ బాబీ డియోల్ ను కూడా రంగంలోకి దింపనున్నాడని తెలిసింది.
ఇక దేవర 2 తర్వాత కొరటాల ప్లాన్ ఏంటంటే.. అల్లు అర్జున్ ఎప్పటి నుంచో కొరటాలతో సినిమా చేయాలి అనుకుంటున్నాడు కానీ.. కుదరడం లేదు. అలాగే మిర్చి సినిమాతో తనకు దర్శకుడిగా అవకాశం ఇచ్చిన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో సినిమా చేయాలి. కొరటాల ప్రభాస్ కోసం కథ రెడీ చేశాడట కానీ.. ఇంత వరకు సెట్ కాలేదు. అలాగే చరణ్ తో మరో సినిమా చేయాలనే ప్లాన్ కూడా ఉందట. ఇలా బన్నీ, ప్రభాస్, చరణ్.. ఈ ముగ్గురులో ఎవరో ఒకరితో సినిమా చేయాలనేది కొరటాల ప్లాన్ అనేది ఇండస్ట్రీ ఇన్ సైడ్ న్యూస్. అయితే.. ఈ ముగ్గురు హీరోలు వరుసగా సినిమాలతో బిజీగా ఉన్నారు. మరి.. కొరటాల ప్లాన్ ఎంత వరకు ఫలిస్తుందో.. ఎవరితో మూవీ సెట్ అవుతుందో చూడాలి.