మరోసారి పోలీసులను ఆశ్రయించిన మెగాస్టార్ చిరంజీవి

Spread the love

Megastar Chiranjeevi Case: టాలీవుడ్ లో చాలామంది సెలబ్రిటీలు ఈమధ్య సోషల్ మీడియా వేదికగా ఎన్నో అభ్యంతరకర పోస్టులను ఎదుర్కొంటున్నారు.. అయితే కొంతమంది సెలబ్రిటీలు ముందుకు వచ్చి అసభ్యకర పోస్టులు అలానే ఫేక్ వీడియోస్ పోస్ట్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోర్టును ఆశ్రయించిన వారు ఉన్నారు.. అందులో టాలీవుడ్ నుంచి మొదటిగా నాగార్జున ఇటీవలే తన ఫోటోలు కానీ వీడియోలు కానీ తన అనుమతి లేనిది ఎక్కడా కూడా ఉపయోగించకూడదు అని కోర్టు నుంచి ఆర్డర్ను తెచ్చుకున్నారు. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి కూడా తనపై తప్పుడు కథనాలు చిత్రీకరిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా.. అలానే ఏఐని ఉపయోగించి డీప్ ఫేక్ ఫోటోలను, వీడియోలను క్రియేట్ చేస్తున్న వారిపై ఫిర్యాదు చేస్తూ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు.. అయితే కోర్టు కూడా ఈ అంశంపై స్పందిస్తూ ఇకపై మెగాస్టార్ చిరంజీవి అనుమతి లేనిది ఎటువంటి అభ్యంతరకర పోస్టులు చేయకూడదు అని ఒక ఆర్డర్ ను పాస్ చేసింది.. అయినా సరే కొంతమంది సైబర్ నేరస్తులు టాలీవుడ్ సీనియర్ హీరో అయిన కొణిదల చిరంజీవి గారిపై అభ్యంతరకగా పోస్టులు పెడుతూ, దుర్భాషలాడుతూ కొన్ని ‘X’ హ్యాండిల్స్ పోస్టులు పెడుతూనే ఉన్నాయి.. ఈ విషయంపై చిరంజీవి మరోసారి సైబర్ క్రైమ్ పోలీసులకు ఆ ట్విట్టర్ హ్యాండిల్స్ ను జత చేస్తూ ఫిర్యాదు చేశారు..Megastar Chiranjeevi Case

గతంలో తను చేసిన ఫిర్యాదుకు అనుకూలంగా సిటీ సివిల్ కోర్ట్ తీర్పు ఇచ్చినా సరే మరి కొంతమంది ఉద్దేశపూర్వకంగానే ఇలాంటి కామెంట్స్ అలానే పోస్టులు చేస్తున్నారంటూ మరొక్కసారి చిరంజీవి ఫిర్యాదులో పేర్కొన్నారు..ఆయనపై దుర్భాషలాడుతూ అభ్యంతరకర పోస్టులు పెడుతున్న వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన సైబర్ క్రైమ్ పోలీసులను కోరారు.. అయితే ఆయన చేసిన ఫిర్యాదులో దయా చౌదరి అనే వ్యక్తి చేసిన కొన్ని వ్యాఖ్యలను ప్రత్యేకంగా హైలెట్ చేస్తూ ఫిర్యాదులో పేర్కొన్నారు చిరంజీవి.. ఈ ఫిర్యాదును స్వీకరించిన సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు..

సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ఈ వార్ పై ప్రాధాన్యత సంతరించుకుంది.. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు IT ACT మరియు భారతీయ న్యాయ సంహిత కింద పలు సెక్షన్లను జోడిస్తూ కేసు నమోదు చేశారు.. అయితే మొదటిగా పోలీసులు అసలు ఈ ట్విట్టర్ హ్యాండిల్స్ ఎవరివి అలాగే డీప్ ఫేక్ వీడియోలు, వెబ్ లింకులు ఎక్కడినుంచి ఆపరేట్ చేస్తున్నారు అని గుర్తించే పనిలో ఉన్నారు.. ఇటువంటి అభ్యంతరకర పోస్టులు పెడుతున్న వారు వెనుక ఎవరు ఉన్నారు అసలు ఎవరు ఇదంతా చేపిస్తున్నారు వ్యక్తిగతంగా చిరంజీవిని ఎందుకు టార్గెట్ చేశారు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.. అతి త్వరలో ఈ పోస్టులు మరియు డీప్ ఫేక్ కంటెంట్ స్ప్రెడ్ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తప్పవంటూ వారి వెనకాల ఉన్న సంస్థలను కూడా వదలము అంటూ పోలీసులు హెచ్చరిక జారీ చేస్తూనే దర్యాప్తు ముందుకు తీసుకెళుతున్నారు.. మరి వీటి వెనకాల ఎవరున్నారు అన్నది తెలియాలి అంటే పోలీసుల దర్యాప్తు ముమ్మరం చేయాల్సిందే.