
National Mushroom Research Center: ఈ మధ్య యువత కూడా వ్యవసాయం వైపు మొగ్గు చూపితోంది.బయట పొలానికి వెళ్లి పని చెయ్యలేని వారు ఇంట్లోనే సులైవన వ్యవసాయం చెయ్యాలని భావిస్తున్నారు. అందులో ముఖ్యంగా పుట్టగొడుగుల సాగు వారికి బెస్ట్ ఆప్షన్ గా కనిపిస్తోంది. ఎన్నో పోషక విలువలు కలిగిన పుట్టగొడుగులకు మార్కెట్లోనూ మంచి డిమాండ్ ఉంది. అందుకే వీటిని పెంచేందుకు యువతే కాదు గృహిణిలు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. ఆదాయం కూడా లాభదాయకంగా ఉండటంతో అందరి దృష్టి ఈ పంట సాగుపై పడింది. ఈ నేపథ్యంలోనే పుట్టగొడుగుల పెంపకంపై విస్తృత పరిశోధనల దిశగా ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం భారత వ్యవసాయ పరిశోధనా మండలి కృషి చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పుట్టగొడుగుల పెంపకానికి ఎంతో అనుకూలంగా ఉంటుందని యువత ఈ రంగంలో స్వయం ఉపాధి పొందడంతో పాటు దీనిని ఒక వ్యాపారంగా నిర్వహించడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయంటున్నారు అధికారులు. ఆ వివరాలు మీకోసం.
పుట్టగొడుగుల పెంపకంపై విస్తృత పరిశోధనలు దిశగా ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం కృషి చేస్తోంది. భారత వ్యవసాయ పరిశోధనా మండలి ఆధ్వర్యంలో 2014 లో ఏర్పాటైన జాతీయ పుట్టగొడుగుల పరిశోధన కేంద్రాన్ని…వినూత్న పరిశోధనలు కార్యక్రమాలతో తిరుపతి శ్రీ వెంకటేశ్వర వ్యవసాయ కళాశాల ముందుకు తీసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో పుట్టగొడుగుల జాతీయ పరిశోధన కేంద్రం డైరెక్టర్ డాక్టర్ వి.పి శర్మ పుట్టగొడుగుల పరిశోధన కేంద్రాన్ని తాజాగా పరిశీలించారు. ఈ పరిశోధన కేంద్రం ద్వారా రైతులకు, యువకులకు గ్రామీణ మహిళలకు శిక్షణతో పాటు స్వయం ఉపాధిగా పుట్టగొడుగుల పెంపకాన్ని ఎంచుకున్న యువతకు సలహాలు, సూచనలు అందిస్తున్నామని ఎన్జీరంగా వర్సిటీ ఉపకులపతి డాక్టర్ శారద తెలిపారు.
పుట్టగొడుగులు పండించాలంటే విత్తనం చాలా అవరం. దానినే స్పాన్ అని అంటారు. ఆ విత్తనాన్ని ప్రస్తుతం బెంగళూరులోని ఐఐహెచ్ఆర్ నుంచి తీసుకొస్తున్నారు. అదే స్పాన్ సెంటర్ తిరుపతిలోని కళాశాలలో ఏర్పాటైతే రైతులకు, మహిళలకు , యువతకు విత్తనం అందించే అవకాశం ఉంటుందని వర్సిటీ ఉపకులపతి తెలిపారు. అందుకే ప్రస్తుతం కళాశాలలో ఉన్న ల్యాబొరేటరీలను, సౌకర్యాలను గమనించిన తర్వాత… ఆల్ ఇండియా కో ఆర్డినేట్ రీసెర్చ్ ప్రాజెక్ట్ వ్యవసాయ కాళాశాలలో మొయిన్ సెంటర్ గా చేయడానికి అవకాశం ఉందన్నారు. National Mushroom Research Center.
భారతదేశంలో ప్రస్తుతం సంవత్సరానికి నాలుగు లక్షల టన్నుల పుట్టగొడుగుల ఉత్పత్తి జరుగుతుంది,. పుట్టగొడుగుల ఉత్పత్తిని పెంచడానికి వాతావరణ పరంగా ఏపీ ఎంతో అనుకూలమైంది. పుట్టగొడుగుల పెంపకానికి అధిక స్థలం అవసరం లేదని తక్కువ పెట్టుబడి తో వ్యవసాయ వ్యర్ధాలను వినియోగించి స్వయం ఉపాధి పొందవచ్చు. ఈ రంగంలో ఎంటర్ ప్రెన్యూర్స్ గా ఎదగడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా పుట్టగొడుగులకు ఉన్న గణనీయమైన పోషక విలువల కారణంగా ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఎంతో మంచి ఫుడ్. విటమిన్ బి12 ,డి విటమిన్ పుష్కలంగా ఉండడం వలన, కొన్ని రకాల పుట్టగొడుగులకు ఉన్న ఔషధ గుణాల కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పుట్టగొడుగుల సాగుకు విస్తృతమైన అవకాశాలు ఉన్నాయి. సీజన్ తో సంబంధం లేకుండా 365 రోజులు పుట్టగొడుగులు సాగు చేయవచ్చని ..సంవత్సరంలో 6 పంటల తీసుకోవచ్చని జాతీయ పుట్టగొడుగుల పరిశోధన కేంద్రం, సోలాన్, హిమాచల్ ప్రదేశ్, డైరెక్టర్, డాక్టర్ విపి శర్మ . తిరుపతి శ్రీ వెంకటేశ్వర వ్యవసాయ కళాశాలలోని పుట్టగొడుగుల పరిశోధన కేంద్రంలో మంచి సౌకర్యాలు ఉన్నాయని ఇక్కడ విత్తన ఉత్పత్తి కూడా చేపట్టడానికి గల అవకాశాలను పరిశీలిస్తున్నామని తెలిపారు.